Crime News :   కన్నకొడుకే తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని, అతని బారి నుంచి తప్పించాలని పి.గన్నవరం మజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి సతీమణి  వెంకట లక్ష్మి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆశ్రయించింది.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌, జిల్లా ఎస్సీ కార్యాలయాలకు వద్ద వచ్చిన ఆమె తన కుమారుడు రవికుమార్ తనపై అనేక వేధింపులకు గురిచేసి తనను చంపాలని చూస్తున్నాడని కన్నీటి పర్యాంతమయ్యింది.. ఆమె ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా విచారణ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


బతికున్నప్పుడు ఆస్తి కోసం తండ్రినీ కుమారుడు వేధించారన్న మాజీ ఎమ్మెల్యే భార్య 


తమ కుమారుడు .. తన భర్త బ్రతికుండగా కూడా ఆయనను అనేక రకాలుగా వేధింపులకు గరిచేసేవాడని, పలువురు రౌడీషీటర్లును తీసుకుని వచ్చి ఆయనపై దాడి చేయించాడని ఈ బాధ తట్టుకోలేకనే ఆయన మృతి చెందారని లపర్తి నారాయణమూర్తి సతీమణి  వెంకట లక్ష్మికుమారి కుమారుడిపై తీవ్ర ఆరోపణుల చేశారు.  ఇప్పుడు తనను కూడా మానసికంగా వేధింపులకు గురిచేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని వాపోయింది. తన భర్తకు సంబందించిన ఆస్తులన్నీ బలవంతంగా రాయించేసుకున్నాడని, ఉన్న చిన్న ఇల్లును కూడా లాక్కుని నన్ను రోడ్డుమీదకు నెట్టాలని ప్రయత్నిస్తున్నాడని వాపోయారు. తాను ఆసుపత్రికి వెళ్లేందుకు ఉపయోగిస్తున్న కారును దౌర్జన్యంగా లాగేసుకున్నాడని కన్నీటి పర్యంత మయింది. 


పరువు పోతుందని ఇప్పటి వరకూ చెప్పుకోలేదన్న వెంకట లక్ష్మి కుమారి 


తన భర్త బ్రతికుండగా కూడా ఆయనను, తనను అనేక సార్లు చేయిచేసుకున్నాడని, పరువు పోతుందని చాలాకాలం ఓపిక పట్టామని, ఇంక భరించలేని స్థితిలో పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ మాకు న్యాయం జరగలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే నాపై నాకకుమారుడు చేస్తున్న దౌర్జన్యాలపై పి,గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసిన్పటికీ ఎస్సై మమ్మల్ని రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తన కుమారుని దౌర్జన్యం నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకు విన్నవించుకున్నానని మీడియాకు తెలిపారు. 


టీడీపీ తరపున రెండు సార్లు గెలిచిన నారాయణమూర్తి 


నారాయణమూర్తి ఈ ఏడాది జూలైలో చనిపోయారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ  1996లో జరిగిన ఉప ఎన్నికలో నగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ-బీజేపీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో పులపర్తి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో పీ.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు.. దీంతో వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ప్రచారానికి వచ్చిన సమయంలో.. ఆయన సమక్షంలోనే కండువా కప్పించుకునేందుకు వెళ్లారు.. కానీ అనూహ్యంగా పార్టీలో చేరకుండా వెనుదిరిగారు. అనంతరం బీజేపీలో చేరారు.