IND vs BAN Test: భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఎడమచేతి వేలి గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ కు దూరమయ్యాడు. కాబట్టి కేఎల్ రాహుల్ టెస్ట్ లకు సారథ్యం వహించనున్నాడు. అలాగే ముందు ఎంపిక చేసిన జట్టులోనూ స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ లో ప్రకటించింది.
మొదటి టెస్టు కోసం రోహిత్ స్థానంలో ఇండియా- ఎ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రానున్నాడు. భుజం గాయం నుంచి మహ్మద్ షమీ, మెకాలి గాయం నుంచి రవీంద్ర జడేజా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్‌లను జట్టులోకి ఎంపిక చేశారు. కెరీర్‌లో ఏకైక టెస్టు (2010లో సౌతాఫ్రికా) ఆడిన ఫాస్ట్‌బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌కు కూడా ఈ సిరీస్‌కు కోసం సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది.
మార్పుల అనంతరం బంగ్లాతో టెస్టులకు భారత జట్టు ఇదే
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవ్‌దీప్ సైని, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.
టీమిండియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ 2-1 తో గెలిచింది. మొదటి రెండు వన్డేల్లో బంగ్లా విజయం సాధించగా... మూడో మ్యాచులో భారత్ ఘన విజయం అందుకుంది. దీంతో టెస్టు సిరీస్ లో అయినా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. మరోవైపు వన్డే సిరీస్ ను గెలుచకున్న బంగ్లా టెస్ట్ సిరీస్ మీద కన్నేసింది.