Investor says Rs 25 lakh salary falls short for family of 3 : ఓ చిన్న కుటుంబాన్ని పోషించడానికి నెలకు ఎంత ఖర్చు అవుతుంది. ఇలా ఎవరైనా అడిగితే.. అందరూ ఒకటే చెప్పరు. రకకకాలుగా చెబుతారు. అయితే ఏడాదికి పాతిక లక్షలు కూడా సరిపోవని ఎవరైనా చేబితే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. సౌరవ్ దత్తా అనే ఇన్వెస్టర్ తనకు ఎడాదికి పాతిక లక్షల జీతం అని.. చేతిలో నెలకు లక్షన్నర ఉంటాయని.. కానీ ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఆ మొత్తం సరిపోవడం లేదని.. ఇక ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలని ఆయన ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. తన జీతం దేనికి ఎంతెంత ఖర్చు చేస్తున్నానో కూడా ఆయన చెప్పుకొచ్చారు.  


లక్ష రూపాయలు ఇంటి అద్దెకు, నిత్యావసరాలకు, ఈఎంఐలకు సరిపోతాయని.. మరో పాతిక వేలు వినోద, విహారాలకు..మరో పాతిక వేలు అత్యవసర ఖర్చులకు పోతున్నాయని ఇక దాచిపెట్టుకోవడానికి ఎక్కడ నగదు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 



 

నిజానికి లక్షన్నర అంటే.. భారత్ లో చాలా పెద్ద మొత్తమే. నెలకు లక్షన్నర వచ్చే వాళ్లు.. క్రమబద్ధంగా ఉంటే..  రెండు, మూడేళ్లలోనే సొంత ఇల్లు కొనేసుకోవచ్చని అంటూంటారు. అందుకే నెటిజన్లు ఆయనకు ఇలాంటి రిప్లైలే ఇచ్చారు. 


 





అయితే అతను చెప్పినట్లుగా యాభై వేల రూపాయలు ఇతర అవసరాలకు ఖర్చు చేయరని.. ట్విట్టర్ అటెన్షన్ కోసమే.. ఇలా ట్వీట్లు చేస్తున్నారని కొంత మంది విమర్శలు గుప్పించారు. 


 





ఎక్కువ మంది  సౌరవ్ పై జోకులేశారు.  తిట్టించుకోవద్దని సలహాలిచ్చారు. మధ్యతరగతి ప్రజలు ఎంత ఆదాయంతో బతుకుతారో వివరించారు. 


 





 ఎంత ఆదాయం వచ్చినా ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది..   దేశంలో పది వేల ఆదాయంతో బతుకుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయని పలువురు గుర్తు చేశారు.