Double Ismart Nizam Distributor and Release: 'డబుల్ ఇస్మార్ట్' పంద్రాగస్టుకు థియేటర్లలో విడుదలకు రెడీ అయ్యింది. బాక్సాఫీస్ బరిలో నిలిచిన మరొక సినిమా రవితేజ 'మిస్టర్ బచ్చన్' ప్రీమియర్ షో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ, 'డబుల్ ఇస్మార్ట్' బుకింగ్స్ మాత్రం ఓపెన్ కాలేదు. అవునా... నిజమా... అని గట్టిగా అడిగితే అయ్యాయని చెప్పాలి. కానీ, నైజాం ఏరియాలో మాత్రం ఇంకా కాలేదు. దీని వెనుక జరిగిన పంచాయితీలు చాలా ఉన్నాయి. తెర వెనుక పెద్ద కహాని జరుగుతోంది.
బయ్యర్ లేడు... ప్రైమ్ షో డైరెక్ట్ రిలీజ్!
'డబుల్ ఇస్మార్ట్' డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh)కు, నైజాంలో థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గొడవలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీసిన 'లైగర్' డిజాస్టర్ కావడంతో రిలీజ్ చేసిన ఎగ్జిబిటర్లకు భారీ లాస్ వచ్చింది. వరంగల్ శ్రీను, పూరికి మధ్య గొడవ జరిగింది. పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లింది మేటర్. అందువల్ల, సినిమా రిలీజ్ కష్టం అనుకున్నారు.
'లైగర్' డిస్ట్రిబ్యూషన్ గొడవలు, ముఖ్యంగా నైజాం ఇష్యూ నేపథ్యంలో పూరి, ఛార్మి కౌర్ (Charmy Kaur) హైదరాబాద్ సిటీకి ముఖం చాటేశారని ప్రచారం జరిగింది. 'డబుల్ ఇస్మార్ట్' పనులు ముంబైలో ఎక్కువ చేయించారు. అసలు నైజాంలో రిలీజ్ డౌట్, సినిమాను కొనే నాథుడు లేడని డిస్కషన్స్ జరుగుతున్న టైంలో పూరి, ఛార్మి పాలిట దేవుడిలా 'హనుమాన్' ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వచ్చాడు. భారీ అమౌంట్ ఇచ్చి రైట్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 54 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఇచ్చి 'డబుల్ ఇస్మార్ట్' కొనేశారు. కానీ, సినిమాను రిలీజ్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నైజాం వరకు ప్రైమ్ షో ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసి ఓన్ రిలీజ్ చేస్తున్నారు.
'డబుల్ ఇస్మార్ట్'కు థియేటర్లకు ఇచ్చేది ఎవరు?
ప్రైమ్ షో ఫిలిమ్స్ నైజాంలో 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ చేయాలని అడుగు ముందుకు వేసింది. కానీ, థియేటర్లు ఇచ్చేది ఎవరు? అనేది పెద్ద క్వశ్చన్. 'మిస్టర్ బచ్చన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ ఒక మాట అన్నాడు. మైతీ మూవీస్ తన సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా థియేటర్లు అడ్జస్ట్ చేసిన శిరీష్ రెడ్డి (దిల్ రాజు బ్రదర్)కు థాంక్స్ చెప్పాడు.
'మిస్టర్ బచ్చన్'కు మైత్రీ సంస్థతో పాటు దిల్ రాజు బ్రదర్స్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మెజారిటీ సినిమా హాళ్లు వాళ్లిద్దరి కంట్రోల్‌లో ఉన్నాయి. ఏషియన్ - సురేష్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్. అయితే... పూరి, ఛార్మి మీద ఉన్న కోపంతో మెయిన్ సెంటర్లలో కొందరు థియేటర్స్ ఓనర్లు 'డబుల్ ఇస్మార్ట్' షోస్ వేయడానికి నో అంటున్నార్ట.
విజయ్ దేవరకొండ 'లైగర్' రిలీజుకు ముందు చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు పూరి, ఛార్మి రూపాయి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ఎథిక్స్ ప్రకారం ఎంతో కొంత ఇవ్వాలి. లాస్ అమౌంట్ 40 పర్సెంట్ ఇస్తే చాలని బాధితులు ముందుకు వచ్చారు. కానీ, డీల్ సెటిల్ కాలేదు. దాంతో ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు. వీలైనంత త్వరగా ఈ ఇష్యూను పూరి, ఛార్మి సెటిల్ చేసుకోకపోతే 'డబుల్ ఇస్మార్ట్' ఓపెనింగ్ డే కలెక్షన్స్ అడ్వాంటేజ్ కోల్పోతుంది.
Also Read: 'కల్కి 2898 ఏడీ'... వచ్చే వారమే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి... అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది