What Is Jumped Deposit Scam : "జంప్డ్ డిపాజిట్" స్కామ్ బారిన పడుతున్న వారు ఇటీవల కాలంలో పెరిగిపోయారు.  UPI ద్వారా చెల్లింపులు చేసేవారిని ఈ స్కామర్లు టార్గెట్ చేశారు. నిజానికి ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ వాడుతున్నారు అందుకే వీరిని ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. ఈ స్కాం గురించి సైబర్ క్రైమ్ నిపుణులు జాగ్రత్తలు చెబుతున్నారు.  


పది రూపాయలు ఎరగా వేసి దోచేసేవాళ్ల టైప్ స్కాం


బ్యాంకుల వద్ద డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చిన వారికి ఓ పది రూపాయలో.. ఇరవై రూపాయలో ఎరగా వేస్తారు. వారికి కొద్ది దూరంలో డబ్బులు వేసి సార్.. మీ డబ్బులు పడిపోయాయని చెబుతారు. వెంటనే ఆ డబ్బులు తీసుకోవడానికి అతను వంగితో బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బుల సంచితో ఉడాయిస్తారు. ఇది నేరుగా చేస్తారు. ఆన్ లైన్ స్కామర్లు కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. ముందుగా తక్కువ మొత్తంలో టార్గెట్ చేసిన వ్యక్తి బ్యాంక్ ఖాతాకు పంపుతారు. వెంటనే ఫోన్లు చేసి డబ్బులు పంపామని ఓ సారి చెక్ చేయాలని కోరుతారు. వెంటనే చెక్ చేస్తే ఆ ఖాతా వారి యాక్సెస్‌లోకి వెళ్లిపోతుంది.       



Also Read: Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ




ఎవరో డబ్బులు జమ చేస్తే జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మొత్తాన్ని చెక్ చేయడానికి వచ్చే లింకుల్ని అసలు క్లిక్ చేయవద్దు.  అలా చేస్తే  పిన్‌ డబ్బులు పంపిన వారికి యాక్సెస్ ఇచ్చేస్తుంది. దీనికి "జంప్డ్ డిపాజిట్" స్కామ్ అని పేరు పెట్టారు.   'జంప్డ్ డిపాజిట్' స్కామ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే  గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు పంపితే అకౌంట్‌లో ఉంచుకోండి. ఎవరైనా డిపాజిట్ ను ధృవీకరించాలని ఫోన్ చేస్తే స్పందించాల్సిన అవసరం లేదు.   కనీసం 15-30 నిమిషాలు వేచిచూడాలి. ఇంకా డౌట్ ఉంటే.. ముందు ఉద్దేశపూర్వకంగా రాంగ్ పిన్ నమోదు చేయండి. ఆ పిన్నే స్కామర్లకు చేరుతుంది. అసలు పిన్ ద్వారా తర్వాత లావాదేవీలు కొనసాగించవచ్చు. 



Also Read : Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!




ఆన్ లైన్ స్కాములపై ఎప్పటికప్పుడు అప్రమత్తత గా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే బ్యాంక్ ఖాతాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఒక్క సారి ఇలా ఆన్ లైన్ మోసగాళ్ల బారిన పడి ఖాతాను వారి చేతుల్లోకి పంపి ఆ డబ్బును తిరిగి తెచ్చుకోవడం అసాధ్యంగా మారుతుంది. అందుకే ఆన్ లైన్ మోసగాళ్లు ఎలాంటి కొత్త కొత్త మార్గాలను పాటిస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే మంచిదని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు.