UP groom calls off wedding over delay in serving rotis: కట్నం సమయానికి ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకునేవాళ్లను చూసి ఉంటాం కానీ రోటీలు ఆలస్యంగా పెట్టారని అలిగి వెళ్లిపోయే వరుళ్లు అరుదుగా ఉంటారు. యూపీలోని చందౌలీలో ఇలాంటి పెళ్లికొడుకు ఉన్నాడు. పెళ్లి ముహుర్తానికి మండపానికి చేరుకోవాల్సిన వ్యక్తి చపాతీలు తినేసి.. ఆ తర్వాత ఆ చపాతీల్ని ఆలస్యంగా ఇచ్చారని అలిగి వెళ్లిపోయాడు. అతన్ని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
అయితే అతను ఇలా పెళ్లి మండపం నుంచి తాళి కట్టే సమయంలో పారిపోవడానికి చపాతీలు ఆలస్యం కాదని కుట్ర ఏదోఉందని వధువు తరపు తల్లిదండ్రులు అనుమానించారు. ఎందుకంటే అప్పటికే ఆ వరుడికి లక్షన్నర డబ్బులు ఇచ్చారు. పెళ్లి పనులు, ఇతర ఖర్చుల కోసం మొత్తంగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత చేసిన తర్వాత చపాతీలు ఆలస్యం అయ్యాయని అలిగి వెళ్లిపోవడం నమ్మశక్యంగా లేదని చర్చించుకున్నారు. అందుకే ఇంటికి వెళ్లి మాట్లాడాలనుకున్నారు.
వరుడికి అతని బంధువు అయిన అమ్మాయితో ముందు నుంచీ సంబంధం ఉందని.. కట్నం కోసం మోసం చేయాలన్న ఉద్దేశంతోనే వేరే ఊరి సంబంధాన్ని మాట్లాడుకున్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఏదో ఓ కారణంతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించి ఏదీ దొరక్క చివరికి చపాతీలు ఆలస్యమయ్యాని చెప్పిన తన స్నేహితులతో కకలి రచ్చ చేసి వెళ్లిపోయాడని భావిస్తున్నారు.
Also Read : Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ