మేష రాశి


ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తనను  మంచిగా ఉంచండి. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.  ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారంలో సక్సెస్ అవుతారు. పారదర్శకంగా ఉండేందుకు ప్రయత్నించండి. 


వృషభ రాశి


ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా పెద్ద కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వ్యాపార సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయ వనరులు బాగానే ఉంటాయి. మీ మనస్సు మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటుంది. 


మిథున రాశి


ఈ రోజు ఈ రాశి వ్యాపారులు నష్టపోతారు. మీ సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దు. కార్యాలయంలో ఏదో ఒక విషయంలో అవమానం ఎదుర్కొంటారు. మీ ఆలోచనలను అందరితో పంచుకోకండి. స్త్రీలు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అప్పులు ఇవ్వొద్దు. 


Also Read: జనవరి 2025 ఈ రాశులవారికి కొత్త కొత్తగా ఉంటుంది - మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది!


 


కర్కాటక రాశి


ఈ రోజు మీరు మీ పనులన్నింటినీ ఉత్తమంగా చేయగలుగుతారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో మీ బాధ్యత పెరుగుతుంది. కళలు  సంగీతం పట్ల ఆసక్తిని కనబరుస్తారు.


సింహ రాశి


ఈ రాశి రోజు ఉద్యోగస్తులు అదనపు ఆదాయానికి సంబంధించిన కొన్ని కొత్త వనరులు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి. మీరు ఈ రోజు సబార్డినేట్ ఉద్యోగులకు పార్టీ  ఇవ్వొచ్చు. మీరు మీ ప్రియమైన వారితో ఒంటరిగా గడుపుతారు.  కుటుంబంలో శాంతి ఉంటుంది. 


కన్యా రాశి


మీరు ఈ రోజు సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ గురించి ఉన్నతాధికారులతో చర్చిస్తారు. నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతాయి. ఈరోజు మీరు మీ సామర్థ్యానికి తగిన ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మతపరమైన కార్యకలాపాలలో ఉత్సాహంగా ఉంటారు.  


తులా రాశి


ఈ  రోజు  ఈ రాశి ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. నూతన ప్రారంభాలకు అంత మంచిరోజు కాదు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువ ఆలోచిస్తారు. కష్టపడితే కానీ సరైన ఫలితాలు రావు.


Also Read:  జనవరి 2025 మాస ఫలాలు - ఈ రాశులవారికి కొత్త ఏడాది కష్టాలతో ప్రారంభమవుతుంది!


వృశ్చిక రాశి


ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మీ కెరీర్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. విద్యార్థులు చదువుపై చాలా ఏకాగ్రతతో ఉంటారు. ఉద్యోగులు శుభవార్త వింటారు.  ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. 


ధనస్సు రాశి


ఈ రాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రోజు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు. కొన్ని సంఘటనల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.  


మకర రాశి


ఈ రోజుని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రారంభిస్తారు. రోజంతా బిజీగా ఉంటారు. ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. సామర్థ్యానికి మించి ఎవరికీ సహాయం చేయొద్దు. కొన్ని అనుకోని సమస్యలలో చిక్కుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకోవాలి.


కుంభ రాశి


ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవాలి. రాజకీయాలకు, విమర్శలకు దూరంగా ఉండండి. మీ ప్రత్యర్థులు స్నేహపూర్వకంగా నటిస్తారు. అనారోగ్య సమస్యలుంటాయి. 


మీన రాశి
 
ఈ రాశి ఉద్యోగుల పనితీరుతో సీనియర్ అధికారుల్ని ఆశ్చర్యపరుస్తారు. నూతన ఉద్యోగం కోసం ఇంటర్యూలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా సెలెక్ట్ అవుతారు. ప్రతికూల ఆలోచనల ప్రభావం మీపై చాలా ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతే నూతన పెట్టుబడులు పెట్టండి.


Also Read: భోగి, సంక్రాంతి సహా జనవరి 2025 లో పండుగలు, సెలవులు..పెద్ద లిస్టే ఇది!