Waqf properties and issues around: వక్ఫ్‌ అన్నది పూర్తిగా ఇస్లామిక్ మతానికి చెందిన ఆస్తుల మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అంశం. వక్ఫ్‌ అన్నది మతపరమైన లేదా చారిటబుల్‌ ఉపయోగాల కోసం నిర్ణయించబడింది. ఒకసారి ఒక భూమి లేదా ఆస్తి వక్ఫ్ కిందకు వెళ్తే.. అది పూర్తిగా చారిటబుల్‌ లేదా మతపరమైన అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు. దాన్ని అమ్మడానికి లేదా కొనడానికి లేదా ఇతరుల పేర్ల మీదకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి కుదరదు. వాస్తవానికి ఈ వక్ఫ్ వెనుక ఉన్న గొప్ప ఉద్దేశం.. చారిటబుల్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం. ఐతే భారత్‌లో ఈ వక్ఫ్ పేరు మీద కొందరు దందాలకు పాల్పడడం వివాదంగా మారింది. ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఆస్తులు దుర్వినియోగం కావడం సహా అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటి కట్టడికి తాము వక్ఫ్‌ అమెండ్‌మెంట్ బిల్ తెస్తున్నట్లు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు చెబుతోంది.


వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం ఎక్కడ జరుగుతోంది ?


దేశంలో వక్ఫ్ కిందకు వేలాది ఆస్తులు, లక్షల ఎకరాలు ఉన్నాయి. వేలాది ప్రైవైట్‌ ల్యాండ్‌ల నుంచి అనేక ప్రైమ్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్‌ భూములు కూడా వక్ఫ్ కింద ఉన్నాయన్న వాదనా ఉంది. వీటిని ఏ విధమైన డాక్యమెంట్స్ లేదా సదరు ఓనర్ల నుంచి అనుమతులు లేకుండానే వక్ఫ్ జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగానే అనేక ల్యాండ్ కబ్జాలతో పాటు దేశవ్యాప్తంగా కోర్టుల్లో సివిల్ కేసులు నడుస్తున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, లాభాపేక్షతో కొందరు ఈ భూములు, ఆస్తులను చెరబట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకొందరు వక్ఫ్ ఆస్తులను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు కూడా విమర్శలు ఉన్నాయి. చారిటబుల్ కార్యక్రమాల కోసం ఇచ్చిన ఆస్తులను కొన్నిసార్లు డబ్బు కోసం కొందరు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చిన ఉదంతాలు కూడా దేశంలో ఉన్నాయి. ఇది ఆ ఆస్తులు ఇచ్చిన ప్రయోజనాలకు విరుద్ధం.


ఈ తరహా విధానాలను హిందూ గ్రూపులతో పాటు మరికొందరుతీవ్రంగా తప్పు పడుతున్నారు.


నరేంద్రమోదీ సర్కారు చట్టంలో ఏ విధమైన మార్పులు తెస్తోంది.. ?


వక్ఫ్ భూములు, ఆస్తుల అన్యాక్రాంతం సహా వాటిని దాతలు ఇచ్చిన ఉద్దేశాలకు విరుద్ధంగా వాణిజ్య ప్రయోజనాలకు వాడడం వంటి చర్యల కట్టడే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు వక్ఫ్ అమెండ్‌మెంట్‌ బిల్లు -2024ను తీసుకొస్తోంది. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ ఆస్తుల రెగ్యులరైజేషన్‌లో ట్రాన్స్‌ఫరెన్సీ సహా వాణిజ్య అవసరాలకు వక్ఫ్ ఆస్తుల వినియోగంపై నిషేధం వంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఈ విధమైన నిబంధనల పట్ల కొన్ని అపోజిషన్ పార్టీలతో పాటు ఇస్లాం గ్రూపులు తమ వ్యతిరేకతను తెలియ చేస్తున్నాయి. కొందరు మాత్రం ఈ చట్టం ద్వారా వక్ఫ్ భూముల సద్వినియోగంలో పారదర్శకత ఏర్పడుతుందని.. మిస్‌యూజ్ ఆగిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టంగా మారితే.. భారతదేశ వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కీలక మార్పులు జరుగుతాయి. వక్ఫ్ ఆస్తులుగా క్లైమ్ చేస్తున్న వాటిపై వెరిఫికేషన్ చేపడతారు. అంతే కాకుండా వక్ఫ్ బోర్డుల్లో కూడా పారదర్శకత వస్తుంది. అంతే కాకుండా దేశంలోని అన్ని మతస్తుల రిలీజియస్‌ రైట్స్‌కు సంబంధించి సమతూకం ఏర్పడుతుందని ఏళ్లుగా పాతుకుపోయిన అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం చెబుతోంది.


వక్ఫ్ ఆస్తుల విషయంలో తొలి ముద్దాయి కాంగ్రెస్సేనంటున్న భాజపా:


దేశ విభజన వేళ ప్రైమ్ ఏరియాల్లో ఉన్న ఆస్తులను, భూములు వక్ఫ్ భూములుగా మార్చిందని కొందరు విమర్శిస్తుంటారు. ఆ చర్య వెనుక కాంగ్రెస్‌కు స్పష్టమైన రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మైనారిటీ కమ్యూనిటీల దగ్గర మెప్పుకోసం ఇతర వర్గాల హక్కులను కాలరాసిందన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా నాడు కాంగ్రెస్ చేసిన తప్పులను తాము నేడు సరిదిద్దుతున్నామని భాజపా నేతలు చెబుతున్నారు.
Also Read: EY Pune employee death : కార్పొరేట్ ఆఫీసులో పని ఒత్తిడి - జాబ్‌లో చేరిన ఏడాదికే యువతి మృతి - కన్నీళ్లు పెట్టిస్తున్న తల్లి లేఖ


వక్ఫ్‌ బోర్డుల కొన్ని చర్యలపైనా విమర్శలు:


వక్ఫ్ బోర్డులు ముస్లింలలోనే కొందరిని బోర్డు కొన్ని అంశాల్లో దరిదాపులకు కూడా రానివ్వరన్న విమర్శలున్నాయి. మహిళలు, బోహ్రా తెగ ముస్లింలను, అగాఖాన్‌లను డెసిషన్ మేకింగ్ అంశాల్లో పక్కన పెడతారన్న అపవాదు ఉంది. ఈ తరహా వైఖరి ఆ బోర్డుల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వక్ఫ్‌ బోర్డుల్లో ఈ చట్టం ద్వారా మార్పులు తీసుకొచ్చి అన్ని ఇస్లాం వర్గాలకు వక్ఫ్ బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ అమెండ్‌మెంట్లకు సంబంధించి వివిధ వర్గాల నుంచి మద్దతుగా ప్రభుత్వానికి వేలాది మెయిల్స్ కూడా వస్తున్నాయి. ప్రజల్లో వక్ఫ్ ఆస్తుల్లో ట్రాన్స్‌ఫరెన్సీ తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల విశ్వాసం పెరిగిందనడానికి ఈ మెయిల్సే ఒక రుజువని భాజపా అంటోంది. ఈ వక్ఫ్ అమెండ్‌మెంట్‌ బిల్లు కేవలం వక్ఫ్ ఆస్తులకు సంబంధించింది మాత్రమే కాదు.. దీని వెనుక చాలా రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. కొన్నికుటుంబాల డైనాస్టీ పాలిటిక్స్‌కు కూడా చరమగీతం పాడడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం తమకు దేశంలోని అందరి ప్రజల మతపరమైన హక్కుల్లో సమానత్వం తేవడమే లక్ష్యమని చెబుతోంది.