PM Narendra Modi speaks on the Uniform Civil Code: కుటుంబంలో ఒకరికి ఓ రూల్... ఇంకొకరికి ఇంకో రూల్ ఉండదు కదా. ఇంట్లో ఉండే అందరికీ ఎలా అయితే ఒక రకమైన రూల్స్ ఉంటాయో దేశం మొత్తం కూడా అలానే ఒకే రూల్ ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న మాట. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన బూత్ కార్యకర్తల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని మరో సారి లేవనెత్తారు. బట్ ఈ సారి ఆయన ఈ టాపిక్ ను ఎత్తిన సందర్భం గురించి ఆలోచించాలి. 


ప్రధాని మోదీ అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి బహిరంగ సభలోనే బీజేపీ కోర్ సిద్ధాంతాల్లో ఒకటైన ఆచరణలో తీసుకురావాలనే ఉన్న ఆకాంక్ష ఉన్న యూనిఫాల్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి గురించి మోదీ మాట్లాడారు. అమెరికా, ముస్లిం ప్రభావిత ఈజిప్ట్ లాంటి దేశాల్లో మోదీకి దక్కిన విశేష ఆదరణ, క్రేజ్ ప్రధాని మోదీ కాన్ఫిడెన్స్ కి కారణమై ఉండొచ్చు కానీ...ముస్లింలను కేవలం ఓటు బ్యాంకులానే భావించటం లేదనే బలమైన సందేశాన్ని మోదీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అసలు ఏంటీ ఉమ్మడి పౌరస్మృతి...స్వతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా ఎందుకు దేశంలో ఒక్కో మతానికి ఒక్కో ప్రత్యేకమైన అధికారాలు, చట్టాలు ఉన్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.


యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే.. సాధారణంగా దేశంలో రెండు రకాలైన చట్టాలు ఉంటాయి. మెుదటిది Criminal Law. ఉదాహరణకు ఎవరైనా దొంగతనం చేశారనుకోండి. వారు హిందూవైనా, ముస్లిం ఐనా, ఇంకా ఏ మతానికి చెందిన వారైనా అందరికి ఒకే రకమైన శిక్షలు విధిస్తారు. క్రిమినల్ లా ముందు... అందరూ సమానమే. రెండవది Civil Law..! అంటే ఇందులో వ్యక్తులకు సంబంధించిన పెళ్లి, విడాకులు, వారసత్వ హక్కులు, దత్తత తదితర అంశాలు ఉంటాయి. వీటిని ఒక్కో మతం వారు ఒక్కోలా పాటిస్తున్నారు ప్రస్తుతానికి. కానీ సివిల్ లా కూడా అందరికీ ఒకేలా ఉండాలని చెప్పేదే యూనిఫామ్ సివిల్ కోడ్ (Uniform Civil Code). 


బాగానే ఉందిగా.. మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటారా.. మనది సెక్యూలర్ దేశం. విభిన్నమతాలకు, తెగలకు చెందిన వారు ఉంటారు. ఉదాహరణకు హిందూ ఆచారాల ప్రకారం.. ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి. విడాకుల ప్రక్రియ కఠినంగా ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన.. భరణం తప్పకుండా ఇవ్వాలి. అలాగే, వారతస్వ హక్కులు ఒకేలా ఉంటాయి. అదే ఇస్లాం ఆచారాల ప్రకారం..పెళ్లి, విడాకుల నియమనిబంధనలు వేరే. ఇదివరకూ ట్రిపుల్ తలాఖ్ ఉండేది. అంటే భార్యతో ఎప్పుడైనా భర్తకు విసుగొస్తే మూడుసార్లు నోటితో, పేపర్ మీదో తలాఖ్ తలాఖ్ తలాఖ్ అని చెప్పి వెళ్లిపోవచ్చు. చట్ట ప్రకారం అది చెల్లేది కూడా. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసింది. 
విడాకులు పొందిన భార్యకు భరణం అందడం కూడా కష్టం. ముస్లింలు అనే కాదు వేర్వేరు మతాలకు ఇలా ప్రత్యేక చట్టాలున్నాయి. ఎన్నో శాతాబ్దాలుగా ఇలా ఆచారాలు పాటిస్తున్న వారంతా యూనిఫామ్ సివిల్ కోడ్ కిందకి తీసుకురావాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కత్తి మీద సామే. సెక్యూలర్ దేశంలో.. ఇది ఏ మాత్రం సాధ్యం కాదని MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 






బీజేపీ అధికారంలోకి రాకముందు నుంచి వారి అజెండాలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. 1. రామజన్మభూమి 2. ఆర్టికల్ -370 రద్దు 3. యూనిఫామ్ సివిల్ కోడ్. మోదీ సర్కార్  రెండోసారి అధికారంలోకి వచ్చాక.. రామజన్మభూమి, ఆర్టికల్ 370 రద్దు సమస్యలకు పరిష్కారం లభించింది. ఐతే.. 2024 ఎన్నికల ముందు వాళ్ల మూడో ప్రధాన అంశం పైకి తెరమీదకు తెస్తున్నారు. అందుకే..ప్రధాని ఈ రోజు చేసిన ప్రసంగం కూడా. ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ పై వేర్వేరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కమిటీలు కూడా వేశారు. ఆర్టికల్-44 ప్రకారం యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకురావాలనే బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా..లేదా ఇది ప్రతిపక్షాలకో, బీజేపీకో కేవలం రాజకీయ అస్త్రంగా మారుతుందా తెలియాలంటే మరికొంత వేచి చూడాలి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial