Cyclone Biparjoy: గతకొంత కాలంగా గుజరాత్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న బిపర్జాయ్ తుపాన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సైక్లోన్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో 1977 తుపాను తర్వాత సుదీర్ఘంగా కొనసాగిన సైక్లోన్ గా స్థానం సంపాధించుకుందని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. బిపర్జాయ్ తుపాను ఆగ్నేయ అరేబియా సముద్రంలో జూన్ 6వ తేదీన మొదలైంది. అయితే అదే నెల 18వ తేదీన బలహీనపడే వరకు వాయుగుండంగా కొనసాగింది. 12 రోజుల మూడు గంటల పాటు తుపానుగా మనుగడ సాధించింది. అరేబియా సముద్రంలో సాధారణంగా ఉత్తర తీవ్ర సైక్లోన్‌ల సగటు ఏజ్‌ ఆరు రోజుల మూడు గంటలు మాత్రమేనని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో 1977 నవంబర్ 8వ తేదీన ఆవిర్భవించిం తుపాను అదే నెల 23వ తేదీన అరేబియా సముద్ర తీరాన్ని తాకి బలహీన పడింది. అయితే ఈ తుపాను జీవన కాలం 14 రోజుల 6 గంటలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత కాలం పాటు కొనసాగిన సైక్లోన్ ఒక్కటి కూడా లేదు. ఈ బిపర్జాయ్ తుపాను మాత్రం ఆ రికార్డుకు దగ్గరగా వచ్చిందని.. ఏకంగా 13  రోజుల మూడు గంటల పాటు కొనసాగిందని అధికారులు వివరిస్తున్నారు. 


బిపర్జాయ్ పయనం 2,525 కిలో మీటర్ల పొడవున సాగింది. మార్గమధ్యలో తొమ్మిది సార్లు తన దిశను మార్చుకుని వాతావరణ శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేసింది. అంతేకాకుండా మెల్లిగా ముందుకు కదులుతూ... మనుగడ సాగించింది. బిపర్జాయ్ తుపాను సగటు వేగం గంటకు 7.7 కిలో మీటర్లుగా ఉందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.  


సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తుపానులు..



  • అరేబియా సముద్రంలో 2019 అక్టోబర్ నెలలో ఆవిర్భవించిన క్యార్ తుపాను 9 రోజుల 15 గంటల పాటు కొనసాగింది. 

  • 2018 నవంబర్ లో బంగాళాఖాతంలో పుట్టిన గజ తుపాను 9 రోజుల 15 గంటల పాటు మనుగడ సాధించింది.


గుజరాత్ ను అతలాకుతలం చేసిన బిపర్జాయ్ 


ఈదురు గాలులు, భారీ వర్షాలతో గుజరాత్‌ని అతలాకుతలం చేసింది ఈ తుపాను. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా...23 మంది తీవ్రంగా గాయపడ్డారు. కచ్‌లో నష్టం ఎక్కువగా వాటిల్లింది. గంటకు 115-120 కిలోమీటర్ల వేగంతో గాలులు విచాయి. కొన్ని రైళ్ల కూడా ఆ వారం రోజుల పాటు రద్దు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే ప్రకటించింది. కచ్‌లోని మాండ్వి, మోర్బిలోని మలియా ప్రాంతాల్లో చెట్లన్నీ కూలిపోయాయి. కరెంట్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిన్నింటినీ అధికారులు వారం పదిరోజుల్లో పునరుద్దరించారు.