ABP  WhatsApp

Warehouse Collapsed In Delhi: నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి

ABP Desam Updated at: 15 Jul 2022 05:40 PM (IST)
Edited By: Murali Krishna

Warehouse Collapsed In Delhi: దిల్లీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి చెందారు.

(Image Source: ANI)

NEXT PREV

Warehouse Collapsed In Delhi: దిల్లీ ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న గోదాము గోడ కూలి ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడ్డారు. అలీపుర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. 






సహాయక చర్యలు






ఈ ప్రమాదంలో శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 20-25 మంది కూలీలు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది అక్రమ నిర్మాణమని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే ఇలా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.


దిల్లీ ప్రభుత్వం


ఈ ప్రమాదంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.



అలీపూర్ ప్రమాదం చాలా బాధాకరం. అధికార యంత్రాంగం ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ విషాద సమయంలో దిల్లీ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంది.మృతుల ఆత్మకు శాంతి కలగాలని, క్షతగాత్రులు క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి


క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. మృతులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


Also Read: Mohammed Zubair Gets Bail: జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు రిలీఫ్- బెయిల్ మంజూరు


Also Read: Justice Umesh Lalit on Court Timings: 'పిల్లలు 7 గంటలకే బడికి వెళ్లినప్పుడు- కోర్టు 9 గంటలకు ఎందుకు ప్రారంభం కాకూడదు?'

Published at: 15 Jul 2022 04:03 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.