Visa Free Entry : భారతీయులకు రష్యా ఓ పెద్ద ఆఫర్ ప్రకటించింది. వీసా లేకుండానే ఇండియన్స్ తమ దేశానికి వచ్చేందుకు అనుమతించబోతోంది. ప్రస్తుతం భారత్-రష్యా మధ్య స్నేహపూర్వక సంబంధాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలను మునుపటి కంటే మెరుగ్గా, పటిష్టం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య తరచుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు రష్యా మరోసారి ఈ స్నేహపూర్వక సంబంధాలకు ఉదాహరణగా నిలుస్తోంది. అందులో భాగంగానే భారతీయులకు రష్యా ఓ పెద్ద బహుమతిని అందిస్తోంది. భారతీయులు 2025లో రష్యాకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని ప్రకటించింది.


ఇటీవలే రష్యా కొత్త వీసా నిబంధనలను అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా భారతీయులు వీసా లేకుండా రష్యాకు వెళ్లవచ్చు. అంతకు ముందు జూన్‌లో, రష్యా, భారత్ పరస్పరం వీసా పరిమితులను సడలించడానికి ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చించినట్లు అప్పట్లో వార్తలు వ్యాపించాయి. అయితే ఈ నిబంధనలు ఆగస్టు 2025 నుంచి అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. అప్పట్నుంచి భారతీయులు వీసా లేకుండా రష్యాకు ప్రయాణించడానికి అర్హులన్నమాట. ఈ ఈ-వీసా(యూనిఫైడ్‌ ఈ-వీసా...UEV) జారీ కావడానికి దాదాపు నాలుగు రోజులు పడుతుంది.


గతేడి జారీ చేసి ఇ-వీసాల సంఖ్య పరంగా చూస్తే.. మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఉండడం గమనార్హంది. భారత ప్రయాణికులకు రష్యా 9 వేల 5 వందల ఈ-వీసాలను ఇచ్చింది. సాధారణంగా భారతీయులు వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం రష్యాకు వెళుతూ ఉంటారు. 2023లో రికార్డు స్థాయిలో 60వేల మంది భారతీయులు మాస్కోను సందర్శించారు. ఇది 2022 కంటే 26 శాతం ఎక్కువ. రష్యాకు ఎక్కువ మంది ప్రయాణించే నాన్-సీఐఎస్ దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. 2024 మొదటి త్రైమాసికంలోనే దాదాపు 1,700 ఇ-వీసాలు జారీ చేశారు.


రష్యా ప్రస్తుతం వీసా రహిత పర్యాటక మార్పిడి కార్యక్రమం ద్వారా చైనా, ఇరాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తోంది. ఇప్పుడు రష్యా సైతం భారత్‌తో వీసారహిత ప్రయాణాన్ని పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా.. ఎందుకు దేశాన్ని సందర్శిస్తున్నారన్న దాంతో సంబంధం లేకుండా యూఈవీ ఉంటే అన్నింటికీ చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు సరళీకరించారు. ఈ సౌకర్యాన్ని 55 దేశాలకు వర్తింపజేసింది. ఆ జాబితాలో ప్రస్తుతం భారత్‌ కూడా చేరింది. చైనా, ఇరాన్‌ దేశాల పౌరులకు వీసా-ఫ్రీ విధానాన్ని అమలు చేస్తుండగా ఇకపై భారత్‌కు కూడా అదే సౌకర్యం కలగనుంది.


అక్రమంగా వలస వచ్చిన వారిపై ఉక్కుపాదం


ఇకపోతే అక్రమగా ప్రవేశించిన వారిని,సరైన పత్రాలు లేకుండా ఉండే వారందర్నీ అమెరికా నుంచి తరిమేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారసభల్లోనూ చెప్పారు. అయితే ఒక్క ఇండియన్స్ ను కాదు అన్ని దేశాలకు చెందిన పత్రాలు లేని అందర్నీ బయటకు పంపేయబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. ట్రంప్ అమెరికాకు వచ్చే వారిని కూడా నియంత్రిస్తారని అంటున్నారు. విద్యా సంస్థల్లో కాలేజీల్లో చదువుకునే వాళ్లను కూడా రానివ్వరని చెబుతూండటంతో అడ్మిషన్లు తీసుకున్న వాళ్లు ముందుగానే అమెరికాకు వెళ్లిపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే వీసాల జారీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగు పెడితే.. ప్రవాస భారతీయులకు సమస్యగా మారే అవకాశాలు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది.


Also Read : Trump: ట్రంట్ వైట్‌హౌస్‌లోకి వెళ్లగానే భారత్‌కు ప్రత్యేక విమానాలు - 18 వేల మంది ఇండియన్స్‌ను గెంటేస్తారట!