Delhi Minister ED : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ ను విచారణ సమయంలో గాయపరిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయనను కస్టడీలో ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా ఓ ఫోటో బయటకు వచ్చింది. అందులో ఆయన పెదవి పగిలిపోయి రక్తపు మరకలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు.
సత్యేందర్ జైన్ మంత్రిగా ఢిల్లీ ప్రజల ఆరోగ్యం కోసం మొహల్లా క్లీనిక్‌లు ఏర్పాటు చేశారని కానీ ఆయనను ఇప్పుడుఈ స్థితిలో చూస్తున్నామని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆప్ నేతలు ప్రధానమంత్రిపై విరుచుకుపడుతున్నారు. రాజకీయ కారణాలతో హింసితున్నారని ఆరోపిస్తున్నారు.