Ban on Plastic Straws:  ప్లాస్టిక్ స్ట్రాలు జూలై ఒకటో తేదీ నుంచి కనిపించకూడదు. వాటి ఉత్పత్తిపై కేంద్రం నిషేధం విధించింది.   మజ్జిగ, లస్సీ వంటి పాల ఉత్పత్తులను, పళ్ల రసాలను టెట్రా ప్యాకెట్లలో అందజేసే సంస్థలు వాటితో పాటు చిన్న ప్లాస్టిక్‌ స్ట్రాలు కూడా అందిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ స్ట్రాలపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ప్లాస్టిక్‌ స్ట్రాల స్థానంలో కాగితం స్ట్రాలు వాడాలని సూచించింది. జులై ఒకటో తేదీ నుంచే నిషేదం అమల్లోకి వస్తుందని కూడా పేర్కొంది. ఇలాంటి స్ట్రాలు లేకుండా ఆయా ద్రవరూప ఉత్పత్తులను అమ్మడం సాధ్యం కాదు. అలాగని ఇప్పటికిప్పుడు పేపర్ స్ట్రాలను ఉత్పత్తి చేసి వినియోగించేందుకు కంపెనీలకు మౌలిక సదుపాయాలు లేవు. 


ప్లాస్టిక్ స్ట్రాలు మరో ఏడాది ఉండాలన్న అమూల్


కేంద్రం ఎటువంటి సంప్రదింపులు జరపకుండా తీసుకున్న ఈ నిర్ణయం పాడి రైతులపైనా, పాల ఉత్పత్తుల వినియోగాదారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని కంపెనీలు చెబుతున్నాయి. నిషేధం నిర్ణయాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయాలనికోరుతున్నాయి. గుజరాత్‌కు చెందిన  పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ 'అమూల్‌' కూడా కేంద్రానికి ఇదే విజ్ఞప్తి చేసింది.  తక్షణమే స్ట్రాలను నిషేదించడం వల్ల రైౖతులు, పాల వినియోగదారులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 


నష్టపోతామని కూల్ డ్రింక్ కంపెనీల ఆందోళన


పళ్ల రసాల చిన్న ప్యాకెట్లు, ఇతర డెయిరీ ఉత్పత్తుల ప్యాకింగ్‌లపై ఈ నిర్ణయం పెను ప్రభావం చూపుతుందన్నారు. శీతల పానీయాల సంస్థలు పెప్సీ, కోకాకోలా కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే నిషేదం అమల్లోకి వస్తే తీవ్రంగా నష్టపోనున్నట్టు తెలిపాయి. కంపెనీలు తామ నష్టపోతామని చెప్పడంలేదు. రైతులు నష్టపోతాయని చెప్పడం ద్వారా కేంద్రాన్ని ఆలోచనలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 


గడువు పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తులు
 
కూల్‌ డ్రింక్‌ సంస్థలైన పెప్సీ, కోకాకోలా కంపెనీలు కూడా కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశాయి. వెంటనే ప్లాస్టిక్‌ స్ట్రాలను బ్యాన్‌ చేస్తే తీవ్రంగా నష్టపోనున్నట్టు తెలిపాయి. ఇ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్ స్ట్రాలను వినియోగించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. కానీ అందుకే ఈ కంపెనీలు సిద్ధం కాలేదు. గుడువు ముంచుకొస్తూండటంతో అదనపు సమయం కోసం అర్థిస్తున్నాయి. గతంలో  కార్లలో ఖచ్చితంగా ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని కేంద్రం నింబంధన తెచ్చింది. ఈ నిబంధన కూడా అమలు చేయలేమని వాయిదా వేయాలని కార్ల కంపెనీలు కారు. ఇప్పుడు స్ట్రాలు కూడా మార్చలేమన కంపెనీలు చెబుతున్నాయి.