Vice Presidential Polls 2022: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్‌ నామినేషన్- హాజరైన ప్రధాని మోదీ

ABP Desam Updated at: 18 Jul 2022 02:57 PM (IST)
Edited By: Murali Krishna

Vice Presidential Polls 2022: ఎన్‌డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్‌ నామినేషన్ దాఖలు చేశారు.

(Image Source: PTI)

NEXT PREV

Vice Presidential Polls 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్​కు ఆయన నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​సింగ్, నితిన్ గడ్కరీ, రామ్​దాస్ అథవాలే పాల్గొన్నారు.






రైతు బిడ్డ







నా లాంటి సాధారణ వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఓ రైతు బిడ్డ ఈ రోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ సహా నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను.                                                                             -  జగదీప్ ధన్‌ఖడ్‌, ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి


ప్రొఫైల్



  • జగదీప్ ధన్​ఖడ్​ రాజస్థాన్‌లోని ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు.

  • చిత్తోడ్‌గఢ్‌ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.

  • రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు.

  • రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. కిసాన్‌పుత్ర అనే గుర్తింపు సాధించారు. 

  • ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు ధన్‌ఖడ్‌.

  • రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు.

  • రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు.


ముఖ్యమైన తేదీలు



  • ఎన్నికల నోటిఫికేషన్: జులై 7

  • నామినేషన్లకు చివరి రోజు: జులై 19 

  • నామినేషన్ల పరిశీలన: జులై 20

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 22

  • పోలింగ్, ఫలితాలు: ఆగస్ట్ 6 


ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం పూర్తి కానుంది.


Also Read: Punjab New Traffic Rules: మందు బాబులకు అలర్ట్- ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రక్తం పిండేస్తారు!


Also Read: Defamation Complaint Filed Against RGV: కొంపముంచిన ఆ ట్వీట్- RGVపై పరువు నష్టం దావా!

Published at: 18 Jul 2022 02:59 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.