Banda Boat Accident :  ఉత్తర్​ ప్రదేశ్​ బాందా జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు.  కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. యూపీ మర్కా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మర్కా నుంచి ఫతేపుర్ ​లో ఉన్న జరౌలీ ఘాట్ ​కు యమునా నది మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలుల కారణంగా సుడిగుండం ఏర్పడి పడవ మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బందిని అధికారులు రంగంలోకి దింపారు. 






17 మంది గల్లంతు! 


ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నుంచి మార్కాకు ప్రయాణికులతో వెళ్తున్న పడవ యమునా నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలు పలువురు మునిగిపోయారని ఏఎన్ఐ తెలిపింది. పడవలో ఉన్న వ్యక్తుల సంఖ్యను అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆరా తీశారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. జిల్లా అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈదురు గాలుల వల్లే బోటు బోల్తా పడిందని స్థానిక ఎస్పీ అభినందన్ విలేకరులతో అన్నారు. ఇప్పటి వరకు 15 మందిని రక్షించామన్నారు. మరో 17 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఇప్పటి వరకూ 4 మృతదేహాలను వెలికితీశారు. NDRF, SDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు. 


పడవల్లో రవాణా 


ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం  ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను కోరారు. మార్కా పరిసర ప్రాంతాల ప్రజలు సమీప పట్టణాలకు చేరుకోవడానికి పడవలు మాత్రమే రవాణా మార్గం. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు మాట్లాడుతూ నది ప్రవాహం ఎక్కువగా ఉందని, పడవ నది మధ్యలోకి వెళ్లగా మునిగిపోయిందన్నారు. పడవ ఒక్కసారిగా బోల్తాపడిందని, పడవ నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నానన్నారు. 


Also Read : Venkaiah Naidu : దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?


Also Read : TS BJP EC : "సాలు దొర - సెలవు దొర"కు ఈసీ నో పర్మిషన్ - కొత్త పేరుతో బీజేపీ మొదలు పెడుతుందా ?