Independence Day 2022:
21గన్ సెల్యూట్‌లో దేశీయ గన్
ఈ సారి ఎర్రకోట వేదికగా జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో దేశీయంగా తయారు చేసిన హోవిట్జర్ గన్‌ను ఉపయోగించనున్నారు. సాధారణంగా స్వాతంత్య్ర వేడుకల్లో 21-గన్ సెల్యూట్‌ని నిర్వహిస్తుంటారు. ఈ సారి హోవిట్జర్‌ను వినియోగిస్తున్నట్టు డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ ఈ విషయ వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అడ్వాన్స్‌డ్ టోడ్ ఆర్టిల్లరీ గన్ సిస్టమ్ (ATAGS)ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తయారు చేసింది. ఇప్పటి వరకూ 21గన్ సెల్యూట్ కోసం బ్రిటీష్ గన్‌లనే వినియోగించేవారు. ఇలా దేశీయంగా గన్స్ తయారు చేసుకోవటం, భారత్‌కు ఎంతగానో ఉపకరిస్తుందని, ఆయుధాల తయారీకి ఇది ముందడుగు అని రక్షణమంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తోంది.
ఎవరు తయారు చేశారంటే..
ఈ గన్‌లో ఉండే టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌ని కూడా వివరించింది డిఫెన్స్ మినిస్ట్రీ. పుణేలో డీఆర్‌డీవోకి చెందిన ఆర్డినెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని సైంటిస్ట్‌లు, ఈ గన్‌ను డిజైన్ చేశారు. ఈ స్వాతంత్య్ర వేడుకల్లో తప్పనిసరిగా వినియోగించేలా త్వరితగతిన తయారు చేయాలని భావించారు. 2013లో DRDO..ATAGS ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. పాత ఇండియన్ ఆర్మీ గన్స్ స్థానంలో అత్యాధునిక 155mm ఆర్టిలరీగన్స్‌తో రీప్లేస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సారి ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని NCC క్యాడెట్స్‌కు ఆహ్వానం అందింది. "జ్ఞాన్ పాత్"పై వీరంతా కూర్చోనున్నారు. ఈ క్యాడెట్లు అందరూతమ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలో రానున్నారు. "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" అనే సందేశానికి ఇది ప్రతీకగా నిలవనుంది. డిఫెన్స్ సెక్రటరీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వీరితో పాటు అంగన్‌వాడీ వర్కర్లు, వీధి వ్యాపారులు, ముద్ర యోజన లబ్ధిదారులూ ఈ వేడుకల్లో పాల్గొనున్నారు.
Also Read: Kajal Aggarwal : రాజమౌళి గారూ, కట్టప్పలా మారిన కాజల్ అగర్వాల్‌ను చూశారా?
Also Read: Nellore Rottela Panduga : వరాల రొట్టెలు పట్టుకునేందుకు భారీగా భక్తులు..! | ABP Desam