Nellore Rottela Panduga : వరాల రొట్టెలు పట్టుకునేందుకు భారీగా భక్తులు..! | ABP Desam
ప్రార్థనాలయాల్లో పంచే ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రతిరూపంగా ప్రసాదాన్ని భక్తులు భావిస్తారు. భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించటంతో పాటు ప్రార్థనాస్థలాల్లో వితరణ చేయటంద్వారా పుణ్యం లభిస్తుందని భావిస్తుంటారు. అచ్చం ఇలాంటి సంప్రదాయమే నెల్లూరు జిల్లాకే తలమానికంగా మారింది. అదే రొట్టేల పండుగ. నెల్లూరు పేరు చెబితే చాలు నెల్లూరు రొట్టెల పండుగ అనే స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఈ పండుగ జరపటం వెనుక చారిత్రక ప్రాశస్త్యం ఉంది.