Popcorn Bill: 


OTT సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు..


మల్టీప్లెక్స్‌కి వెళ్లి సినిమా చూడాలంటే కూడా అప్పు చేయాల్సి వస్తోంది. అలా ఉంటున్నాయి టికెట్ రేట్‌లు. వీటికి తోడు పాప్‌కార్న్, కూల్‌ డ్రింక్స్ రేట్‌లైతే భయపెడుతున్నాయి. అందుకే చాలా మంది థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం తగ్గించేశారు. OTTలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇదంతా ఏమీ ఆలోచించకుండా వెళ్లిన వాళ్లకు థియేటర్‌లో గట్టి షాకే తగులుతోంది. ఈ మధ్యే ఓ నెటిజన్ ట్విటర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ మూవీకి వెళ్లిన ఆ వ్యక్తి ఇంటర్వెల్‌లో ఓ పెప్సీ, పాప్‌కార్న్ కొనుక్కున్నాడు. బిల్ చూసి హడలిపోయాడు. 55 గ్రాములున్న పాప్‌కార్న్‌కి రూ.460 బిల్ వేసింది ఆ థియేటర్. ఇక 600 ఎమ్ఎల్ పెప్సీ బాటిల్‌కి రూ.360 ఛార్జ్ చేసింది. ఈ రెండింటికీ కలిపి రూ.820 బిల్ చెల్లించాల్సి వచ్చింది. వెంటనే ఆ బిల్‌ని ఫోటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు బాధితుడు. నోయిడాలోని PVR సినిమాస్‌లో ఇలా ఛార్జ్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశాడు. 


"55 గ్రాముల చీజ్ పాప్‌కార్న్ రూ.460, పెప్సీ బాటిల్ రూ.360. మొత్త కలిపి రూ.820. ఈ డబ్బులతో ఓ ఏడాదికి సరిపడ అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. జనాలు థియేటర్లకు వెళ్లడం ఎందుకు తగ్గించారో అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడం చాలా మందికి తలకు మించిన భారమవుతోంది"


- ఓ నెటిజన్ 






ఈ ట్వీట్‌కి వేలాది లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. ఇంత కాస్ట్ ఎలా భరించగలం అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే..పాప్‌కార్న్‌కి పెట్టే డబ్బులేదో సినిమా అయిపోయాక ఓ రెస్టారెంట్‌కి వెళ్లి ఫుల్‌ మీల్స్‌కి పెట్టుకోవచ్చు అని సెటైర్లు వేస్తున్నారు. అందుకే మేము థియేటర్‌కి వెళ్లినా పాప్‌కార్న్‌ కొనడం మానేశాం అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. 


అందుకే అంత కాస్ట్..



పాప్‌కార్న్‌ను ఎందుకింత కాస్ట్ పెట్టి అమ్ముతున్నారన్న ప్రశ్నకు పీవీఆర్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ  వివరణ ఇచ్చారు. "ఇప్పుడిప్పుడే ఇండియాలో సింగిల్‌ స్క్రీన్స్‌ పోయి..మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లో విక్రయించే ఫుడ్‌ కాస్ట్‌కు ఆపరేషనల్ కాస్ట్‌ను కూడా కలుపుతాం. అందుకే వాటి ధర ఎక్కువగా ఉంటుంది" అని చెప్పారు...బిజ్లీ. ప్రస్తుతానికి భారత్‌లో ఫుడ్ అండ్ బేవరేజిస్ మార్కెట్ విలువ రూ.1500కోట్లుగా ఉందని వెల్లడించారు. "మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ స్క్రీన్స్‌ ఉంటాయి. కనీసం 4-6 స్క్రీన్స్‌ ఏర్పాటు చేస్తారు. వీటి కోసం మల్టిపుల్ ప్రొజెక్షన్ రూమ్స్, సౌండ్ సిస్టమ్స్‌ అవసరమవుతాయి. కేవలం థియేటర్లలోనే కాకుండా...మల్టీప్లెక్స్‌ అంతా ఏసీలతో కవర్ చేస్తాం. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో ఏసీలు వినియోగించాల్సి వస్తుంది" అని వివరించారు.


Also Read: అజిత్ పవార్ మహారాష్ట్ర సీఎం అవుతారా? బీజేపీ శిందేని పక్కన పెట్టేస్తుందా?