Political Parties: 



వెబ్‌పోర్ట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశం..


కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇకపై అన్ని రాజకీయ పార్టీలు తమ ఫైనాన్షియల్ అకౌంట్స్‌కి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌పోర్టల్‌ని క్రియేట్ చేయనుంది. ఎన్నికల కోసం ఎంత ఖర్చు చేశారన్న లెక్కలు ఇందులో డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయడానికి వీలుంటుంది. ఎన్నికల వ్యయంపై పారదర్శకత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అకౌంటబిలిటీ కూడా పెరుగుతుందని వెల్లడించింది. పోల్ ప్యానెల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే...ఏదైనా ఓ పార్టీ ఆన్‌లైన్‌ ఈ లెక్కలు సబ్మిట్ చేయకపోతే..అందుకు కారణాలేంటో ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కారణం సరైనదే అనిపిస్తే...హార్డ్ కాపీ ఫార్మాట్‌లో వాటిని సబ్మిట్ చేసేందుకు ఈసీ అనుమతినిస్తుంది. ఆ తరవాత ఎన్నికల సంఘమే ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేస్తుంది. ఫిజికల్ రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారంగానే ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చామని అధికారులు వెల్లడించారు.