US Reacts On Arvind Kejriwal And Congress :అసలే ఎన్నికల టైం, ఆ పైన కీలక నేత అరెస్టు, మరోవైపు ఎన్నికల బాండ్ల దుమారం, ఇంకోవైపు కాంగ్రెస్‌ ఖాతాల ఫ్రీజింగ్ ఇలా అనేక అంశాలు ప్రజల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఇది మనం దేశంలోనే కాదు ప్రపంచస్థాయి దేశాల్లో దీనిపై డిస్కషన్ నడుస్తున్నట్టు పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. దీనిపై అమెరికా చేసిన కామెంట్స్‌ ఆ వెంటనే కేంద్రం రియాక్షన్ ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో తెలుస్తోంది. 


అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌నోటిసులు


ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు పెను సంచలనంగానే చెప్పవచ్చు. ఎన్నికల టైంలో ఇలాంటి స్టెప్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకే ఇంతగా ప్రపంచ స్థాయిలో దీనిపై చర్చ నడుస్తోంది. చివరకు అమెరికా కూడా స్పందించే స్థాయికి వెళ్లిపోయింది. 
అమెరికా తీరుపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ US తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా ఉన్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేసింది. ఆమెను పిలిచిన భారత్ విదేశాంగ శాఖ జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. 




అన్నీ తెలుసు అంటున్న అమెరికా విదేశాంగ శాఖ 


దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ను మీడియా ప్రశ్నిస్తే ఆయన కూడా అదే తీరున రియాక్ట్ అయ్యారు. మాథ్యూమిల్లర్‌ మాట్లాడుతూ..."ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సహా మిగతా పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నాం. ఐటీ అధికారులు తమ బ్యాంకు ఖాతాలలో కొన్నింటిని స్తంభింపజేశారని ఇది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపబోతోందన్న కాంగ్రెస్ చేసిన ఆరోపణల గురించి కూడా మాకు తెలుసు." అని చెప్పుకొచ్చారు. 




న్యాయం చేయాలని చెప్పాం


ఈ విషయంలో తాము తప్పు చేయలేదని... న్యాయపరమైన చర్యలను పారదర్శకంగా తీసుకోవాలని మాత్రమే చెప్పామని అంతే కానీ ప్రైవేట్ సంభాషణలను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. మాథ్యూమిల్లర్‌ ఏమన్నరాంటే..." ఈ సమస్యల్లో ప్రతిదానికీ పారదర్శకమైన చట్టపరంగా జరిగే ప్రక్రియను మేము ప్రోత్సహిస్తాము. మీరు అడిగిన మొదట ప్రశ్నను గౌరవిస్తూ.. నేను ఏ ప్రైవేట్ డిప్లొమాటిక్‌ సంభాషణల గురించి మాట్లాడను, అయితే మేమేం చెబుతున్నామంటే... పారదర్శకమైన, సమయానుకూలమైన చట్టపరమైన ప్రక్రియను మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పాను. ఇది ఎవరికీ అభ్యంతరం కాదనే నేను భావిస్తున్నాను.