Student Suicide Prevention:


ఉమ్మీద్‌ గైడ్‌లైన్స్...


విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్యల్ని అరికట్టేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ డ్రాఫ్ట్‌ గైడ్‌లైన్స్‌లో "Plan of Action"ని విడుదల చేసింది. వెల్‌నెస్ టీమ్స్‌ని ఏర్పాటు చేయడంతో పాటు టీచర్లకు అవగాహన కల్పించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం లాంటివి చేపట్టాలని సూచించింది. అంతే కాదు. విద్యార్థుల ప్రవర్తనలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే గుర్తించి అప్రమత్తమవ్వాలని వెల్లడించింది కేంద్ర విద్యాశాఖ. UMMEED పేరుతో ఈ మార్గదర్శకాలు వెలువరించింది. UMMED అంటే..Understand, Motivate, Manage, Empathise, Empower, Develop. అన్ని స్కూల్స్‌కి ఇప్పటికే ఈ మార్గదర్శకాలను పంపింది. ఈ సమస్యలోని సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడంతో పాటు అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు అవసరమైన మోరల్ సపోరప్ట్ ఇచ్చేందుకు చొరవ చూపించాలని సూచించింది. 


"విద్యార్థుల ఆత్మహత్యల్ని అరికట్టేందుకు స్కూల్ యాజమాన్యాలు చొరవ చూపించాలి. స్కూల్ వెల్‌నెస్ టీమ్స్ (SWT)ని ఏర్పాటు చేయాలి. స్కూల్ ప్రిన్సిపల్‌ ఈ టీమ్స్‌ని లీడ్ చేయాల్సి ఉంటుంది. ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయని తెలిసిన వెంటనే అప్రమత్తమవ్వాలి. ఓ విద్యార్థి ప్రవర్తనలో మార్పులు వస్తే వెంటనే గమనించి అప్రమత్తం చేయాలి. వెంటనే SWTని అలెర్ట్ చేయాలి. ఆ తరవాత ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోకుండా ఆపగలగాలి"


- కేంద్ర విద్యాశాఖ 


ఏడాది పాటు అవగాహన..


దాదాపు ఏడాది పాటు విద్యార్థులకు,ఉపాధ్యాయులకు, కుటుంబ సభ్యులకు ఓరియెంటేషన్ ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. ఈ ప్రోగ్రామ్స్‌ని స్కూల్ యాజమాన్యాలే నిర్వహించాలని తెలిపింది. తనను తాను హాని చేసుకోవాలని ప్రయత్నించినా, గతంతో పోల్చితే ఓ విద్యార్థి మాట్లాడే తీరు మారిపోయినా వెంటనే చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. 


కోటాలో వరుస ఆత్మహత్యలు..


రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ బలవన్మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మరో విద్యార్థి ప్రాణాలు తీసుకుంది. NEET ఎంట్రెన్స్ టెస్ట్‌కి ప్రిపేర్ అవుతున్న 16 ఏళ్ల విద్యార్థిని తన గదిలోనే ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఏడాదిలో కేవలం 8 నెలల్లోనే 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రాంచీకి చెందిన విద్యార్థిని కోటాలోని ఓ హోటల్‌లో ఉంటూ చదువుకుంటోంది. NEET ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఆమె ఉన్నట్టుండి ఉరి వేసుకుని చనిపోయింది. కారణాలేంటన్నది ప్రస్తుతానికి తెలియలేదు. కోటాలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఏటా చదువుకోడానికి వస్తుంటారు. JEE,NEET లాంటి పరీక్షల కోసం ఇక్కడే ఉంటూ కోచింగ్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఏడాది అత్యధికంగా 25 మంది విద్యార్థులు చనిపోయారు. ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. రాజస్థాన్ పోలీసుల డేటా ప్రకారం...2018లో 18 మంది, 2016లో 17, 2017లో 7, 2018లో 20, 2019లో 18 మంది 2022 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య 25కి చేరుకుంది. 2020,21లో మాత్రం ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదు. 


Also Read: హిజాబ్‌ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు