Anurag Thakur: 


అనురాగ్ ఠాకూర్ బైక్‌రైడ్..


కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ బైక్‌రైడ్ చేశారు. ఢిల్లీలో Moto GP Ridersతో కలిసి బైక్ నడిపారు. భారత్‌లో తొలిసారి మోటో జీపీ రేస్ (Moto GP Race) జరగనుంది. ఈ ఈవెంట్‌ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలా సందడి చేశారు అనురాగ్ ఠాకూర్. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో The Buddh International Circuit (BIC) ఈ రేస్‌ని నిర్వహించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 22-24 వరకూ మోటో జీపీ రేస్ జరగనుంది. గతంలో BIC 2011-13 మధ్య కాలంలో ఫార్ములా వన్ రేస్‌ని కూడా ఏర్పాటు చేసింది. మోటోజీపీ రేస్‌ని నిర్వహిస్తున్న 31వ దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. అనురాగ్‌ ఠాకూర్‌కి కస్టమైజ్డ్‌ హెల్మెట్‌ ఇచ్చారు BCCI మాజీ ప్రెసిడెంట్. ఆ హెల్మెట్‌తోనే రైడ్ చేశారు.





ఈ ఈవెంట్‌పై ఠాకూర్ స్పందించారు. తొలిసారి ఇండియాలో ఈ రేస్‌ జరుగుతోందని వెల్లడించారు. భారత్‌లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇది జోష్ తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


"మోటో జీపీ రేస్ తొలిసారి భారత్‌లో జరుగుతోంది. గౌతమబుద్ధనగర్‌లో ఇది జరగనుంది. ఈ రేస్‌లో తొలిసారి ఇండియన్ రేసర్ పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ తరవాత ఇండియాలో కూడా రేసింగ్ బైక్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కూడా బూస్ట్ వస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేసింగ్‌లో భారత్ దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రక్రీడాశాఖ మంత్రి