Uniform Civil Code: 


మౌనాన్ని సహించలేం..


యునిఫామ్ సివిల్‌కోడ్‌ని వ్యతిరేకిస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. UCC విషయంలో ఆ పార్టీ స్టాండ్‌ ఏంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మౌనంగా ఉండడం వెనక అర్థమేంటి..? అని నిలదీశారు. సంఘ్ పరివార్‌ తీసుకుంటున్న ర్యాడికల్ నిర్ణయాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"యునిఫామ్ సివిల్‌ కోడ్‌పై కాంగ్రెస్‌కి ఓ క్లారిటీ ఉందా..? అసలు ఆ పార్టీ స్టాండ్ ఏంటి? సైలెంట్‌గా ఉండటమే అనుమానాలకు తావిస్తోంది. భారతదేశానికే సొంతమైన భిన్నత్వంపై సంఘ్ పరివార్ దాడులను అడ్డుకోవడం అత్యవసరం. మరి కాంగ్రెస్‌ ఇందుకు సిద్ధంగా ఉన్నట్టేనా? ఈ పాలసీపై కాంగ్రెస్‌కి అవగాహన ఉందా. నిజంగా ఉండుంటే వాళ్ల అభిప్రాయాలేంటి? హిమాచల్ ప్రదేశ్ మంత్రి ఒకరు యూసీసీని స్వాగతించారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయమేనా"


- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి






కాంగ్రెస్ కౌంటర్..


అయితే...సీఎం కామెంట్స్‌పై కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కే సుధాకరన్ మండి పడ్డారు. వామపక్ష పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కేవలం పొలిటికల్ గెయిన్‌ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింలను టార్గెట్‌గా చేసుకుని మత విద్వేషాలు రెచ్చ గొడుతోందని ఆరోపించారు. 


కాంగ్రెస్‌ కసరత్తు..


యునిఫామ్ సివిల్ కోడ్ (UCC)పై కేంద్రం స్పీడ్ పెంచిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కసరత్తులు మొదలు పెట్టింది. వర్షాకాలం సమావేశాల్లో ఈ బిల్‌ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అంతకు ముందు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి దీనిపై డిస్కస్ చేయనుంది. అయితే...అటు కాంగ్రెస్ మాత్రం ఈ కోడ్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోనియా గాంధీ కీలక నేతలతో ఇప్పటికే చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ మరో కీలక భేటీ నిర్వహించనున్నారు సోనియా గాంధీ. పార్లమెంట్‌లో ప్రస్తావించిన అంశాలపై చర్చించడంతో పాటు యునిఫామ్ సివిల్‌ కోడ్ బిల్ ప్రవేశపెడితే ఏం చేయాలన్నదీ డిస్కస్ చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. జులై 3వ తేదీన ప్రత్యేకంగా యూసీసీ గురించే చర్చించేందుకు సమావేశమైంది.  యూసీసీపై ఎలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి..? అనే అంశాలపై వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. నేరుగా సోనియా గాంధీ రంగంలోకి దిగడం వల్ల UCCని ఆ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోందని అర్థమవుతోంది. ఇది కేవలం మైనార్టీలను అణిచివేసేందుకే అని ప్రచారం చేసి ఎంతో కొంత బీజేపీకి డ్యామేజ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పలు విపక్షాలూ వ్యతిరేకిస్తున్నాయి.


Also Read: Viral Video: అయ్యో, వినాయకుడికి రెయిన్ కోర్టు లేదు నాన్నా - చిన్నారి క్యూట్ వీడియో వైరల్!