Viral Video: చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం. వాళ్లు ఏం చెప్పినా, మాట్లాడినా చాలా ముద్దుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడే మాటలు వస్తున్న పిల్లలు అయితే మరీనూ. తమకొచ్చే చిన్న చిన్న డౌట్లతో కుటంబ సభ్యుల ప్రాణాలు తోడేస్తుంటారు. ప్రతీది అడుగుతూ తెగ అల్లరి చేసేస్తుంటారు. అయితే తాజాగా ఇలాంటి ఓ క్యూట్ బేబీ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. అందులో చిన్నారి అడిగిన ప్రశ్న వింటే నవ్వు రాక మానదు. 


అసలేం జరిగిందంటే..?


కుటుంబ సభ్యులతో కలిసి ఓ పాప వినాయకుడి గుడికి వచ్చింది. అయితే ఆ సమయంలో వర్షం పడడంతో అక్కడికి వచ్చిన వారంతా గొడుగులు, రెయిన్ కోర్టులతో వచ్చారు. బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా రెయిన్ కోర్టు వేసుకొని ఆలయానికి వచ్చారు. ఈక్రమంలోనే దేవుడిని దర్శించుకున్నారు. అయితే గుడిలో కాకుండా వినాయక విగ్రహం బయట ఉంది. అక్కడే అంతా నిలబడి దేవుడిని ప్రార్థిస్తున్నారు. పాప కూడా దండం పెట్టుకుంది.


అప్పుడే చిన్నారి ఓ విషయం గమనించింది. ఇదే విషయాన్ని తన తండ్రితో పంచుకుంది. నాన్నా గణపతి బప్పకు రెయిన్ కోర్టు లేదంటూ క్యూట్ క్యూట్ గా చెప్పింది. ఏంటీ వినాయకుడికి రెయిన్ కోర్టా అంటూ వాళ్ల నాన్న నవ్వుకున్నారు. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న ఎవరీ వీడియో తీసి నెట్టింట పెట్టారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. 






Godman Chikna అనే నెటిజెన్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేయగా.. గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. జులై 6వ తేదీ సాయంత్రం 4.21 నిమిషాలకు వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ.. తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అంని కొందరు చెబుతుండగా... వెరీ క్యూట్ అని మరికొంత మంది అంటున్నారు. ఇది నిజమైన భక్తి అని ఓ నెటిజెన్ చెప్పగా.. ప్యూర్ సోల్ అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి. 


ఇటీవలే డాక్టర్ గ్లౌజ్ లు పీకేస్తూ శిశువు అల్లరి


మామూలుగా చిన్నారులు ఎప్పుడూ చేతులు పిడికిలి పట్టుకుని ఉంటారు. శిశువుల నుంచి కొన్ని నెలల వయస్సు వచ్చేంత వరకు వాళ్లు చేతులు ముడుచుకుని ఉంటారు. పెద్ద వాళ్లు వారి వేళ్లను చిన్నారుల పిడికితో పట్టుకునేలా చేసి తెగ ఆనంద పడిపోతుంటారు. అలాగే వాళ్లు ఎంత బలంగా పట్టుకుంటారో కూడా తెలిసే ఉంటుంది. కొన్ని సార్లు వాళ్ళకు తెలియకుండానే కొన్ని వస్తువులను, దుప్పట్లను, తల్లుల జుట్టు గట్టిగా పట్టుకోవడం తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు అనుభవమే. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ శిశువు కూడా అలాగే తన పిడికిలితో డాక్టర్ గ్లౌవ్‌ను గట్టిగా పట్టేసాడు. ఎంతకీ వదల్లేదు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఎంటర్‌టైన్ చేస్తోంది.