World Richest Beggar Bharat Jain: ప్రపంచంలోనే అత్యంత రిచ్‌ పర్సన్‌, భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ఆసియన్‌ బిలియనీర్స్‌ గురించి మీరు వినే ఉంటారు. అలాగే, బిలియనీర్‌ నుంచి బిచ్చగాడిగా మారిన స్టోరీతో వచ్చిన 'బిచ్చగాడు' సినిమాను, బిచ్చగాడి నుంచి బిలియనీర్‌గా మారిన 'బిచ్చగాడు-2' సినిమా కూడా చూసే ఉంటారు.             


అయితే, కోట్లాది రూపాయలు కూడబెట్టిన అసలు, సిసలైన సంపన్న బిచ్చగాడిని ఎప్పుడైనా చూశారా, లేదా అతని గురించి విన్నారా?. 


ప్రపంచంలోనే అత్యంత ధనిక బిచ్చగాడు               
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన యాచకుడి ఆస్తుల గురించి తెలిస్తే మీ బుర్ర గిర్రున తిరుగుతుంది. కోటి కాదు, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ. 7.5 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టాడతను.                


ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు అనగానే, డాలర్లు యాచిస్తూ అమెరికాలోనో, కెనడాలోనో ఉంటాడని అనుకోవద్దు. అతను పక్కా భారతీయుడు, ముంబయి నివాసి. అతని పేరు భరత్ జైన్ ‍‌(Bharat Jain). చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయాడు. ముంబయి వీధుల్లో యాచిస్తూ తిరిగాడు. భరత్‌ జైన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కుటుంబంతో కలిసి, ముంబయిలోని పరేల్‌ ప్రాంతంలో ఉన్న ఓ డూప్లెక్స్‌ హౌస్‌లో ఉంటున్నాడు. జైన్‌కు సోదరుడు, తండ్రి కూడా ఉన్నారు.          


మరో ఆసక్తికర కథనం: టమాట, అల్లం కష్టాలు అప్‌గ్రేడ్‌! ధరల పెరుగుదలతో ప్రజల్లో భయం!


భరత్ జైన్ నెల సంపాదన ఒక లకారం               


భరత్‌ జైన్‌కు ముంబయిలో రూ. 1.2 కోట్ల విలువైన ఓ డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ ఉంది. ఠాణెలో మరో రెండు షాప్‌లు ఉన్నాయి. వాటి ద్వారా నెలనెలా రూ. 30 వేల అద్దె వస్తుంది. స్థిర, చరాస్తులన్నీ కలుపుకుంటే జైన్‌ ఆస్తుల విలువ రూ.7.5 కోట్లు. 


ముంబయిలోని ఖరీదైన ప్రాంతాల్లోనే జైన్‌ యాచిస్తాడు. రోజూ 10 నుంచి 12 గంటల్లో రూ.2,000 నుంచి రూ.2,500 వరకు సంపాదిస్తాడు. ఈ విధంగా చూస్తే, భిక్షాటన ద్వారా అతని మంత్లీ ఇన్‌కమ్‌ రూ.60,000 నుంచి రూ.75,000 వరకు ఉంటుంది. అద్దెల నుంచి వచ్చే రూ.30,000 వేలను కూడా కలిపితే రమారమి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు.


భరత్‌ జైన్‌ పిల్లలు లోకల్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో చదువుకుంటున్నారు. కుటుంబ సభ్యులు స్టేషనరీ షాప్‌ రన్‌ చేస్తున్నారు. దాన్నుంచి కూడా మంచి ఆదాయం వస్తోంది. తమ ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి, యాచక వృత్తి వదిలేయమని ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంత చెప్పినా భరత్‌ జైన్‌ వినట్లేదు. తనను జీవితంలో నిలబెట్టిన బొచ్చెను చచ్చినా వదిలేది లేదని చెబుతున్నాడు.


మరో ఆసక్తికర కథనం:మరణించిన వ్యక్తి కూడా ITR ఫైల్‌ చేయాలి, లేకపోతే ఏమవుతుందో తెలుసా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial