ITR Of The Deceased Also Be Filled: మరణించిన వ్యక్తి కూడా ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫైల్ చేయవలసి ఉంటుందని మీకు తెలుసా?. ఇది నిజం. మరణించిన వ్యక్తి (deceased person) పేరిట పన్ను చెల్లించదగిన ఆదాయం ఉంటే, ఇన్‌కమ్ టాక్స్ లా (Income Tax Law) ప్రకారం టాక్స్ రిటర్న్ దాఖలు చేయాలి. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొస్తాడు, ITR ఎలా ఫైల్ చేస్తాడన్న డౌట్స్ అక్కర్లేదు. మరణించిన వ్యక్తి పేరు మీద, అతని చట్టబద్ధ వారసుడు (legal heir) ఆదాయ పన్ను పత్రాలు సమర్పించవచ్చు.
మరణించిన వ్యక్తి తరపున ఆదాయ పన్ను పత్రాలను ఇంట్లో కూర్చొనే దాఖలు చేయవచ్చు. చనిపోయిన వ్యక్తి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందు, చట్టబద్ధ వారసుడు తనను తాను లీగర్ హైర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ వ్యక్తి జీవించి ఉన్న రోజు వరకు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. మినహాయింపునకు మించి ఆదాయం ఉంటే, వర్తించే స్లాబ్ స్టిస్టమ్ ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ టాక్స్ రిఫండ్ ఉంటే, దానిని కూడా క్లెయిమ్ చేయవచ్చు. ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఆదాయపు పన్ను విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఐటీ రిటర్న్ దాఖలు చేయకపోతే అదే పద్ధతిలో వ్యవహరిస్తుంది.
మరణించిన వ్యక్తి ITR ఫైల్ చేయడానికి ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి?
ముందుగా, www.incometaxindiaefiling.gov.in/home లింక్ ద్వారా ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్ హోమ్ పేజ్‌కు వెళ్లండి
మీ యూజర్ ఐడీ (పాన్), పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి, 'మై అకౌంట్'లోకి వెళ్లండి
ఆ తర్వాత మిమ్మల్ని రిప్రజెంటివ్‌గా నమోదు చేసుకోండి
ఇప్పుడు న్యూ రిక్వెస్ట్‌లోకి వెళ్లి కంటిన్యూ చేయండి
మరణించిన వ్యక్తి పాన్, పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వివరాలు ఫిల్ చేయండి
రిక్వెస్ట్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్ పరిశీలించి ఆమోదిస్తుంది
మరణించిన వ్యక్తి యొక్క ITR ఎలా ఫైల్ చేయాలి?
వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ITR ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ఆ ఫామ్‌లో అడిగిన అన్ని వివరాలను నింపాలి
ఇప్పుడు, ఆ ఫామ్‌ను XML ఫైల్ ఫార్మాట్‌లోకి మార్చండి. ఎందుకంటే, ఆ ఫైల్‌ను XML ఫార్మాట్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయగలం
పాన్ కార్డ్ వివరాలు అడిగే ఆప్షన్‌లో, చట్టబద్ధ వారసుడి వివరాలు ఇవ్వాలి
ఇప్పుడు ITR ఫామ్ పేరు, అసెస్‌మెంట్ ఇయర్ ఆప్షన్స్ ఎంచుకోండి
XML ఫైల్ అప్‌లోడ్ చేసి, డిజిటల్‌గా సంతకం చేసిన తర్వాత ఫామ్‌ను సబ్మిట్ చేయండి
ముందుగా ఆదాయాన్ని లెక్కించండి
మరణించిన వ్యక్తి పేరిట రిటర్న్ ఫైల్ చేసే ముందు అతని ఆదాయాలు, వ్యయాలు, పెట్టుబడులు, లాభనష్టాలు వంటివన్నీ లెక్కగట్టాలి. ITR ఫైల్ చేసే ముందు బతికి ఉన్న వ్యక్తి ఎలాంటి లెక్కలు వేసుకుంటాడో, మరణించిన వ్యక్తి విషయంలోనూ అదే పద్ధతిలో పని చేయాలి, అదే పద్ధతిలో IT రిటర్న్ దాఖలు చేయాలి.
మరో ఆసక్తికర కథనం: ఎక్కువ వడ్డీ ఇచ్చే HDFC బ్యాంక్ స్పెషల్ స్కీమ్, లాస్ట్ డేట్ చాలా దగ్గరలో ఉంది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial