HDFC Bank Special FD: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో జాయిన్ కావడానికి లాస్ట్ ఛాన్స్ ఇది. ఈ పథకం శుక్రవారంతో (07 జులై 2023) ముగుస్తుంది. ఆ స్పెషల్ FD పేరు సీనియర్ సిటిజన్ కేర్. సీనియర్ సిటిజన్ల కోసం దీనిని లాంచ్ చేశారు.
సీనియర్ సిటిజన్ కేర్ FD స్కీమ్ వివరాలు
ఈ పథకం కింద డిపాజిట్ చేస్తే, సీనియర్ సిటిజన్లకు 0.75% ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 2020 మే 18న ఇది స్టార్టయింది. స్కీమ్ గడువును ఇప్పటికే చాలాసార్లు ఎక్స్‌టెండ్ చేశారు, ఫైనల్‌గా ముగింపు స్టేజ్‌కు వచ్చేసింది. 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలానికి ఈ టర్మ్ డిపాజిట్ తీసుకోవచ్చు.
HDFC బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ టర్మ్ డిపాజిట్ల మీద సీనియర్ సిటిజన్‌లు ఇప్పటికే 0.50 శాతం ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్ కేర్ స్కీమ్‌లో మరో 0.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్కీమ్‌పై ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ 7.75 శాతం. రూ.5 కోట్ల కంటే తక్కువ విలువైన టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. శుక్రవారం లోగా ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేస్తే, సీనియర్ సిటిజన్లు ఎక్కువ వడ్డీ ఆదాయం అందుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ల కోసం HDFC బ్యాంక్ అందిస్తున్న FD స్కీమ్స్
7 రోజుల నుంచి 29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDపై 3.50% వడ్డీని సీనియర్ సిటిజన్స్ పొందుతారు
30 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్‌పై FDపై 4% వడ్డీ ఆదాయం
46 రోజుల నుంచి 6 నెలల FDపై 5% ఇంట్రెస్ట్ రేట్
6 నెలల 1 రోజు నుంచి 9 నెలల టర్మ్ డిపాజిట్ మీద 6.25% వడ్డీ
9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే FDపై 6.50 శాతం వడ్డీ
1 సంవత్సరం నుంచి 15 నెలల కాలానికి 7.10 శాతం వడ్డీ ఆదాయం
15 నెలల నుంచి 18 నెలల FDపై 7.60 శాతం ఇంట్రెస్ట్ రేట్
18 నెలల నుంచి 4 సంవత్సరాల 7 నెలల డిపాజిట్‌పై 7.50% వడ్డీ
2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు సాగే FDపై 7.70% ఇంట్రెస్ట్ రేట్
4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల కాల గడువుతో ఉండే FDపై బ్యాంక్ అత్యధికంగా 7.75% వడ్డీని చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల FDపై 7.75 శాతం వడ్డీ పొందుతారు.
పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌తో పోలిస్తే...
హెచ్‌డీఎఫ్‌సీ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ కంటే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఎక్కువ వడ్డీని అందిస్తోంది. ఇది కూడా సీనియర్ సిటిజన్ల కోసమే ప్రారంభమైంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 8.2 శాతం వడ్డీ రేటు అందుతుంది. 60 ఏళ్లు పైబడిన ఇండియన్ సిటిజన్ ఇందులో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు, దానిని గరిష్టంగా మరో 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో కనీసం రూ.1000, గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
మరో ఆసక్తికర కథనం: క్రేజీ మార్క్ దాటిన బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీలు, లైఫ్‌లో ఒక్కసారే ఇలాంటిది చూస్తాం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial