BSE-listed Firms Market Valuation: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు బ్రేకుల్లేని బండ్లలా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా, ప్రతి రోజూ కొత్త 'లైఫ్‌ టైమ్‌ హై'ని క్రియేట్‌ చేస్తున్నాయి. ఓవరాల్‌ సంపద విషయంలోనూ ఇదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నాయి. 


రూ.301.10 లక్షల కోట్ల మైల్‌స్టోన్‌
మదుపర్ల సంపదగా పరిగణించే BSE లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ, చరిత్రలో తొలిసారిగా, ఇవాళ (గురువారం, 06 జులై 2023) ఉదయం ట్రేడింగ్‌లో రూ. 301.10 లక్షల కోట్ల మైల్‌స్టోన్‌ దాటింది. ఇది దీని జీవిత కాల గరిష్ట స్థాయి. ఈక్విటీల్లో ర్యాలీ కంటిన్యూ కావడంతో, మార్కెట్ క్యాపిటలైజేషన్ (mcap) రూ. 3,01,10,526.12 కోట్లకు చేరింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో తొలిసారిగా రూ. 300 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.


ఈ ఏడాది మార్చి 28 నుంచి BSE-లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ దాదాపు రూ. 252 లక్షల కోట్లుగా ఉంది. కేవలం ఈ మూడు నెలల్లోనే 18.5 శాతం లేదా రూ. 48 లక్షల కోట్లు పెరిగింది. ఇదే కాలంలో, సెన్సెక్స్‌ దాదాపు 13 శాతం గెయిన్స్‌ సాధించింది, నిఫ్టీ కూడా ఇదే స్థాయిలో లాభపడింది. 


కొత్త లైఫ్‌ టైమ్ హై
BSE బెంచ్‌మార్క్ సెన్సెక్స్, ఇవాళ, 65,693.09ను టచ్‌ చేసి మరోసారి లైఫ్‌ టైమ్ హైని సెట్‌ చేసింది. ఈ ఏడాది జూన్ 26 నుంచి జులై 4 వరకు జరిగిన రికార్డ్‌ స్థాయి ర్యాలీలో BSE బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 2,500 పాయింట్లకు పైగా పెరిగింది.


క్రితం సెషన్లో 65,446 వద్ద ముగిసిన BSE సెన్సెక్స్‌ ఇవాళ 65,391 వద్ద మొదలైంది. 65,328 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,693 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. 


బుధవారం 19,405 వద్ద ముగిసిన NSE నిఫ్టీ ఇవాళ 19,385 వద్ద ఓపెనైంది. 19,373 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,472.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. నిఫ్టీకి ఇది న్యూ 'లైఫ్‌ టైమ్‌ హై'.


ఇవాళ... సెన్సెక్స్ ప్యాక్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం పైగా పెరిగింది. పవర్ గ్రిడ్, నెస్లే, లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రాటెక్ సిమెంట్, NTPC, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ మేజర్‌ గెయినర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి.


ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతీ, HDFC, HDFC బ్యాంక్ నష్టపోయాయి.


ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIs) బుధవారం రూ. 1,603.15 కోట్ల విలువైన ఈక్విటీస్‌ కొన్నారు. 


ప్రస్తుతం... ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


బుధవారం అమెరికన్‌ మార్కెట్లు రెడ్‌ కలర్‌లో ముగిశాయి.


మరో ఆసక్తికర కథనం: నైకా షేర్లు 38% పతనమైనా 'బయ్‌ రేటింగ్స్‌' ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial