Presidential Poll 2022:


రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ముంబయిలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీలో సోమవారం సమావేశం జరిగింది. ఈ భేటీలో శివసేన ఎంపీలతో ఠాక్రే చర్చించారు. ఇందులో 12 మందికి పైగా ఎంపీలు.. ముర్ముకే మద్దతు ఇవ్వాలని ఠాక్రేకు సూచించినట్లు సమాచారం.


ఇద్దరు లేరు


ఉద్ధవ్ నివాసంలో జరిగిన సమావేశానికి ఇద్దరు ఎంపీలు తప్ప అందరూ హాజరయ్యారు. శివసేనకు మొత్తం 18 మంది ఎంపీలున్నారు. వీరిలో భావన, శ్రీకాంత్ శిందే (సీఎం ఏక్‌నాథ్ శిందే తనయుడు) గైర్హాజరయ్యారు. మెజార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తుండటంతో ఉద్ధవ్ కూడా ముర్ముకే మద్దతు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


ముర్ముకే






రాష్ట్రపతి ఎన్నికల సమయంలో గతంలో కూడా శివసేన రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ఎంపీ గజానన్ కీర్తికర్ గుర్తు చేశారు. ప్రతిభా పాటిల్ యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి అయినా మరాఠీ మహిళ కావడంతో గతంలో మద్దతిచ్చామన్నారు. అలాగే యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి అయినా ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చామని కీర్తికర్ అన్నారు. తాజా ఎన్నికల్లో కూడా ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కావడం వల్ల ఉద్ధవ్ ఆమెకే మద్దతిస్తారని ఆయన చెప్పారు. 


Also Read: Parliament Of India: నూతన పార్లమెంట్‌పై 6.5 అడుగుల జాతీయ చిహ్నం- ఆవిష్కరించిన ప్రధాని


Also Read: Goa Political News: మహారాష్ట్రలో ముగిసింది, గోవాలో మొదలైంది- ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్!