Goa Political News: మహారాష్ట్రలో నరాలు తెగే ఉత్కంఠ భరిత రాజకీయాలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే గోవాలో అలజడి మొదలైంది. అధికార భాజపాలో కాంగ్రెస్ నేతలు చేరుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. కమలం పార్టీతో టచ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇదీ జరిగింది
ఈ కుట్రలో భాగమైన ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలపై గోవా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. వారిపై అనర్హత వేటుకు సిద్ధమైంది. గోవా అసెంబ్లీలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, కేదార్ నాయక్, రాజేష్ ఫల్దేశాయి, డెలియాలా లోబో గైర్హాజరయ్యారు.
ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన వారంతా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు భాజపాలో చేరుతున్నట్లుగా వార్తలొచ్చాయి. దీంతో కాంగ్రెస్‌లో చీలిక కోసం ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, భాజపాతో కుమ్మక్కై కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దినేష్ గుండూరావు ఆరోపించారు.
వేటు కోసం
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గోవా అసెంబ్లీ స్పీకర్ రమేష్ తవాడ్కర్‌ను కోరినట్లు గోవా పీసీసీ చీఫ్ అమిత్ పాట్కర్ తెలిపారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఎంపీ ముకుల్ వాస్నిక్‌కు గోవా పంపింది.
రూ. 50 కోట్లు!
గోవాలో తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు.
Also Read: Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట- ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం
Also Read: Vladimir Putin: 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న పుతిన్!