ఈ విశ్వంలో అద్భుతాలు ఎన్నో. భూమి కక్ష్యలో టెలిస్కోపును ప్రవేశపెట్టగలిగితే చాలు యావత్ విశ్వాన్ని చదివియొచ్చు. మన శాస్త్రవేత్తలు కన్న కలలు అన్నీ ఇవి కావు. కానీ కాంతిని ఎనలైజ్ చేయటం అంటే ఈజీ కాదన్న సత్యం తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు. కారణం కాంతి అంటే మనకు కంటికి కనిపించేదే కాదు.. అది ఇంకా చాలా రూపాల్లో ఉంటుంది. కంటితో చూడలేని కాంతి రూపాలు ఎన్నో ఉంటాయి.
ఆల్ట్రా వైలెట్ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్, రేడియో వేవ్స్, మైక్రో వేవ్స్, ఇన్ ఫ్రారెడ్ వేవ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాండ్స్ ఆఫ్ లైట్ మనతో మాట్లాడుతోంది. మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది.
మనం విశ్వంతో మాట్లాడాలన్నా..విశ్వం మనతో మాట్లాడాలన్నా ఈ లైట్ వేవ్స్ అన్నింటినీ చూడగలిగే టెలిస్కోపులు మనకు కావాల్సిందే. విశ్వానికి ఓ భాష ఉంది అనుకుందాం. అనుకుంటే ఈ వేర్వేరు బ్యాండ్స్ ఆఫ్ లైట్స్ అన్నీ ఆ భాషలకు యాసల్లాంటివి.
1. హబుల్ స్పేస్ టెలిస్కోప్:
హబుల్ స్పేస్ టెలిస్కోప్ విజబుల్ లైట్, ఆల్ట్రా వయొలైట్ రేస్‌తో పాటు ఎలక్ట్రో మాగ్నటిక్ స్పెక్ర్టంలోని నియర్ ఇన్ ఫ్రారెడ్ రీజిన్స్ మీద పని చేయగలదు. 1990లో ఎర్త్ లోయర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టిన ఈ టెలిస్కోప్‌నకు అమెరికన్ ఆస్ట్రోనమర్ ఎడ్విన్ పావెల్ హబుల్ పేరు మీద ఆ పేరు పెట్టారు. జేమ్స్ వెబ్ ప్రయోగించక ముందు వరకూ మానవ జాతి తరపున ఇదే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్. హబుల్ టెలిస్కోప్ మీద ఇప్పటి వరకూ 16 వేలకుపైగా రీసెర్చ్ పేపర్స్ విడుదలయ్యాయి. 4 వేల మంది రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. నాసాకు చెందిన గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ దీన్ని కంట్రోల్ చేస్తోంది.
2. స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ (Spitzer Space Telescope)
ఇన్ ఫ్రారెడ్ కిరణాల మీద పని చేస్తూ స్పేస్‌ను జల్లెడ పట్టేందుకుగానూ నాసా 2003లో ప్రయోగించిన టెలిస్కోప్ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్. అమెరికన్ ఫేమస్ ఆస్ట్రానమర్, థిరటికల్ ఫిజిసిస్ట్ లైమన్ స్పిట్జర్ పేరు మీదుగా ఈ టెలిస్కోప్‌కు స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. దీన్ని ప్రయోగించినప్పుడు కేవలం రెండున్నరేళ్ల పని చేయొచ్చన్న ఎక్స్‌పెక్టేషన్స్, మహా అంటే లిక్విడ్ హీలియం సప్లై పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయే వరకూ అంటే మరో ఐదేళ్లు పని చేయొచ్చు అనుకున్నారు. 2003 నుంచి 2020 వరకూ అద్భుతంగా పని చేసింది ఈ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్. 2020 జనవరి 30 దాని ఆపరేషన్స్ ఎండ్ అయిపోయాయి. ఇన్ ఫ్రారెడ్ వేవ్స్ మీద బలంగా పనిచేసిన పెద్ద టెలిస్కోప్ ఇదే.
3. చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ (Chandra Xray Space Observatory)
CXO చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీకి ఆ పేరు ప్రఖ్యాత భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గౌరవార్థం పెట్టారు. 1999 జూలై 23 న కొలంబియా స్పేస్ షటిల్ STS 93 ద్వారా ఈ టెలిస్కోప్ ను ప్రవేశపెట్టారు. ప్రత్యేకించి ఎక్స్ రేస్ మీద వర్క్ చేస్తూ అనంతమైన విశ్వంపై ఈ అబ్జర్వేటరీ పనిచేస్తోంది. ఐదు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుందన దీన్ని ఇరవై మూడేళ్లుగా బ్లాక్ హోల్స్ రహస్యాలను ఛేదించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ
4. కాంప్టన్ గామా రే అబ్జర్వేటరీ (compton gamma ray observatory)
గామా రేస్ పైన వర్క్ చేస్తూ ఖగోళ అధ్యయనాలు నిర్వహించేలా కాంప్టన్ గామా రే అబ్జర్వేటరీని అంతరిక్షంలో ఏర్పాటు చేశారు. 1991 లో దీన్ని ప్రయోగిస్తే 2000 సంవత్సరం వరకూ ఈ గామా రే అబ్జర్వేటరీ అద్భుత ఫలితాలను అందించింది. మొత్తం 17వేల కిలోగ్రాముల బరువైన పేలోడ్ తో తిరిగిన ఈ అబ్జర్వేటరీ అత్యంత బరువైనది రికార్డులు సాధించింది. దీని తర్వాత ప్రవేశపెట్టిన ఇంటగ్రల్, స్విఫ్ట్, అగైల్, ఫెర్మి గామా రే స్పేస్ టెలిస్కోపులు కాంప్టన్ ప్రయోగాల ఆధారంగా ఆ ఫలితాలను మరింత ముందు కు తీసుకెళ్తున్నాయి
5. మైక్రోవేవ్ టెలిస్కోప్ (Microwave Telescope)
రీసెంట్ స్పేస్ బార్న్ మైక్రోవేవ్ టెలిస్కోప్ ల గురించి మాట్లాడుకోవాలంటే విల్కిన్సన్ మైక్రోవేవ్ అనిసోట్రోపీ ప్రోబ్ గురించి మాట్లాడుకోవచ్చు. విశ్వం కరెక్ట్ వయస్సు ఎంతో అంచనా వేసేందుకు ఇది చేసిన పరిశోధనలు ఉపయోగపడ్డాయి. ఈ విశ్వం ఏర్పడి సుమారుగా 1300 కోట్ల సంవత్సరాలు గడిచి ఉండొచ్చన ఈ మైక్రోవేవ్ టెలిస్కోప్ అంచనా వేసింది. బిగ్ బ్యాంగ్ జరిగిన నాలుగు లక్షల సంవత్సరాలు తర్వాత ఈ విశ్వం ఎలా ఉండేదో ఓ అంచనాకు వచ్చేందుకు విల్కిన్సన్ టెలిస్కోప్ చేసిన పరిశోధనలు ఉపయోగపడ్డాయ్.
6. నాసా వెబ్ (Nasa Webb)
ఇప్పుడు ఫైనల్ గా నాసా వెబ్. ఇన్ ఫ్రారెడ్ కిరణాలను సైతం అన లైజ్ చేయగలుగుతూ...ఎన్నో మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీల నుంచి ఫెయింట్ ఇన్ ఫ్రా రెడ్ లైట్ ను ఎనలైజ్ చేయగలిగే సత్తా జేమ్స్ వెబ్ సొంతం. మానవ నిర్మిత అతి పెద్ద టెలిస్కోప్ గా పేరుగడించిన నాసా వెబ్ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే అతి విడుదల చేసే ఆ తొలి ఫోటోలు బయటకి రావాల్సిందే.
సో ఇది ఇప్పటివరకూ వేర్వేరు లైట్ బాండ్స్ మీద పనిచేసిన స్పైస్ టెలిస్కోప్ లు, అబ్జర్వేటరీల వల్ల కలిగిన ఉపయోగం.