జిల్లా, హైకోర్టుల్లో తమకు న్యాయం జరగలేదు అని అనుకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుంటారు. అలాంటిది ఓ కేసు చూసి ఏకంగా సుప్రీం కోర్టే షాకైంది. 30 ఏళ్లు కాపురం చేసి.. 11 ఏళ్లుగా విడిగా ఉంటున్న భార్యాభర్తలు పరస్పరం 60 కేసులు పెట్టుకున్న తీరు చూసి సుప్రీం కోర్టు అవాక్కయింది.
ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కొహ్లి ధర్మాసనం వాఖ్యానించింది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేలా మధ్యవర్తిత్వానికి వెళ్లడం ఉత్తమమని దంపతుల తరఫు న్యాయవాదులకు తెలిపింది.
మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కారమయ్యేదాకా ఇతర పెడింగ్ కేసుల జోలికి వెళ్లేందుకు ఇద్దరినీ అనుమతించబోమని ధర్మాసం తేల్చి చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు మళ్లీ పిటిషన్లను విచారణకు తీసుకునేందుకు పరిశీలిస్తామని సుప్రీం పేర్కొంది. అయితే ఇన్నేళ్లలో ఇన్ని కేసులా అని ఈ వార్త చదివినవారు కూడా అవాక్కవుతున్నారు.
ఎందుకు?
సంసారం అన్నాక ఆలుమగల మధ్య చిన్నచిన్న కలతలు సహజం. అయితే, ఈ జంట మాత్రం 41 ఏళ్లలో ఒకరిమీద ఒకరు 60 కేసులు పెట్టుకున్నారు. 30 ఏళ్లు కాపురం చేసి.. మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. 11 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు.
Also Read: NEET 20022: నీట్ 2022కు సంబంధించిన కీలకమైన అప్‌డేట్ చూశారా? త్వరగా మేల్కొండి లేకుంటే ఇబ్బంది పడతారు
Also Read: NEET-JEE 2022 Dates: జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు - సీబీఎస్‌ఈ విద్యార్థులకు హ్యాపీ