సీబీఎస్‌ఈ పరీక్షల రోజునే జేఈఈ మెయిన్ పరీక్ష లేకుండా షెడ్యూల్‌లో ఎన్టీఏ మార్పులు చేసింది. రెండు రోజులుగా దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ రెండు పరీక్షలు ఒకే రోజు ఉంటే విద్యార్థులు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పాలని పెద్ద ఉద్యమమే చేశారు. సోషల్ మీడియా వేదికగా కేంద్రానికి విన్నపాలు పంపించారు.
విద్యార్థుల కోరికను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మన్నించి షెడ్యూల్‌ను సవరించింది. ఆ మార్పులు ఇలా ఉన్నాయి
ఎగ్జామ్ సెషన్ | గతంలో ప్రకటించిన పరీక్ష తేదీ | మార్చిన తేదీ |
జేఈఈ మెయిన్ సెషన్ -1 | ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 | జూన్ 20, 21, 22, 23, 24,25, 26, 27, 28, 29 |
జేఈఈ మెయిన్ సెషన్ -2 | మే 24, 25, 26, 27, 218, 29 | జులై 21,22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 |
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2022 పరీక్ష ఈ నెలలోనే నిర్వహించాలని ముందు ప్రకటించిన షెడ్యూల్‌లో ఉంది. అదే టైంలో సీబీఎస్‌ఈ పరీక్షలు కూడా ఉండటంతో విద్యార్థల్లో టెన్షన్ పెరిగిపోయింది.
సీబీఎస్‌ఈ ఇంటర్ రెండో టెర్మ్ పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు జరపనుంది. ఎన్టీఏ కూడా ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపైనే విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ రెండు పరీక్షలు ఒకే టైంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో తీవ్రంమైన చర్చ నడిచింది. విద్యాశాఖ మంత్రికి, ఎన్టీఏకు విన్నపాలు చేస్తున్నారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరారు.
దీన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్లారు. #PostponeJEEMain2022 హ్యాస్‌టాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. ఈ రెండు పరీక్షల మధ్య సరిపడా గ్యాప్ ఉండాలని కోరారు విద్యార్థులు. సీబీఎస్‌ఈ, ఎన్టీఏ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావాలని సూచించారు.
ఇలాంటి కీలకమైన పరీక్షలను అధికారులు చాలా క్లిష్టతరం చేస్తున్నారని అందుకే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. కాస్త ఆలస్యమైతే పరీక్షలకు ఎలాంటి ముప్పు ఉండదని... ఇలా చేస్తే మాత్రం విద్యార్థులు పిచ్చెక్కిపోతారని అన్నారు. ఈ టెన్షన్‌లో మార్కులు రాకపోతే చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు విద్యార్థులు.
ఈ వివాదంపై ఫన్నీ ట్రోల్స్ కూడా నడిచాయి. సీరియస్‌గా నడుస్తున్న టాపిక్‌కు హాస్యం జోడించి సోషల్ మీడియాలో షేర్ చేశారు మరికొందరు విద్యార్థులు.
జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబందించిన షెడ్యూల్‌ను గత నెలలోనే ఎన్టీఏ విడుదల చేసింది. అది జరిగిన కొన్ని రోజులకే సీబీఎస్‌ఈ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. దీంతో ఈ రెండు పరీక్షలపై విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
మొత్తానికి అందరి అభిప్రాయలు తీసుకున్న ఎన్టీఏ జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌ను పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు ఫుల్ హ్యాపీ అయ్యారు.