Shyam Saran Negi Death: స్వతంత్ర భారత దేశపు తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మరణించారు. విషయం తెలుసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 106 ఏళ్ల నేగి నవంబర్ రెండో తేదీన తన ఇంటి నుంచే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల - 2022కి చివరి ఓటు వేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నేగి కొత్త తరం యువతరానికి ఆదర్శం అని.. ఆయనను చూసి చాలా మంది యువత ఓటు వేసేందుకు ముందుకు వస్తారని ప్రధాని పేర్కొన్నారు.
శ్యామ్ శరణ్ నేగి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. నేగీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నేగి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ట్వీట్ చేస్తూ.. ఆయన స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై అసాధారణమైన విశ్వాసం ఉన్న వ్యక్తి అని తెలిపారు. దేశానికి ఆయన సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని వివరించింది.
హిమాచల్ లోని కిన్నౌర్ కు చెందిన నేగీ అనారోగ్యంతో మృతి చెందారు. 1717 జులై 1వ తేదీన జర్మించిన నేగి.. స్కూల్ టీచల్ గా పని చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో 1951లో జరిగిన తొలి సార్వత్రికి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోంచుకున్నారు. నిజామనికి తొలి సార్వత్రికి ఎన్నికల్లో చాలా దశలు 1952 ఫిబ్రవరిలో జరిగినప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ 5 నెలలు ముందుగానే జరిగాయి. ఆ ఏడాది అక్టోబర్ 25వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం.