ABP  WhatsApp

Sharad Pawar: 'నాకూ ఓ లవ్ లెటర్ వచ్చింది'- ఐటీ శాఖ నోటీసులపై పవార్ పవర్‌ఫుల్ పంచ్!

ABP Desam Updated at: 01 Jul 2022 03:44 PM (IST)
Edited By: Murali Krishna

Sharad Pawar: తనకు ఐటీ శాఖ ఓ లవ్ లెటర్ రాసిందని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

(Image Source: PTI)

NEXT PREV

Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌కు ఆదాయ పన్నుశాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన తరువాతి రోజే పవార్‌కు ఈ నోటీసులు వచ్చాయి. అయితే ఈ నోటీసులపై పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


2004, 2009, 2014, 2020 ఎన్నికల్లో పవార్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఉన్న సమాచారాన్ని తాజాగా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఈ మేరకు శరద్ పవార్ కూడా ట్వీట్ చేశారు. 





ఈడీ, ఐటీ లాంటి కేంద్ర ఏజెన్సీ సంస్థలు రోజురోజుకు బాగా పనిచేస్తున్నాయి. విచారణకు హాజరు కావాలంటూ కేంద్ర ఏజెన్సీలు కొంతమందికి మాత్రమే నోటీసులు పంపిస్తుంటాయి. ఈ కొత్త పద్దతి ఇటీవలే మొదలైంది. ఐదు సంవత్సరాల క్రితం ఈడీ పేరు మాకు కూడా తెలియదు. కానీ ఈ రోజు గ్రామాల్లో సైతం నీ వెనకాల ఈడీ ఉందంటూ జోకులు వేసుకుంటున్నారు.  నాకు కూడా ఓ లవ్ లెటర్ అందింది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల్లో నేను ఇచ్చిన ప్రమాణపత్రాలకు సంబంధించి నాకు ఆదాయ పన్ను శాఖ ప్రేమ లేఖ రాసింది. -                                                                       శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత


2004, 2009లలో పవార్ లోక్‌సభకు పోటీ చేశారు. ఆ తర్వాత 2014, 2020లో రాజ్యసభకు పోటీ చేశారు. ఈ ఎన్నికల అఫిడవిట్‌లకు సంబంధించి ఐటీ నోటీసులు ఇచ్చింది. 


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 17వేల కరోనా కేసులు- 23 మంది మృతి


Also Read: Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'

Published at: 01 Jul 2022 03:39 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.