Same Gender Marriage:
స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపునివ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వీటికి గుర్తింపునివ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానికి ఇచ్చిన అఫిడవిట్‌లో తేల్చి చెప్పింది. భారత దేశ సంస్కృతికి ఇది విరుద్ధమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధంగా లేదని వెల్లడించింది. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా ఈ స్వలింగ వివాహాలకు గుర్తింపునివ్వడం కుదరదన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వివాహ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన భద్రత ఏదీ ఈ స్వలింగ వివాహాలకు వర్తించవని తేల్చి చెబుతున్నారు నిపుణులు. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అనే హక్కు ఉన్నప్పటికీ...అది స్వలింగ వివాహాలకు వర్తించదు. పైగా...ఈ వివాహాలు ప్రాథమిక హక్కుల్లోనూ లేదు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.