ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరో 250 మంది భారతీయ విద్యార్థులను ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం దిల్లీకి చేర్చింది. వీరికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం 2 గంటల 45 నిమిషాలకు విమానం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. భారతీయ విద్యార్థులకు తాము అండగా ఉన్నామని సింధియా వారికి భరోసా ఇచ్చారు.
మరో విమానం
ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి భారత్‌కు 709 మంది వచ్చారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశం రొమేనియాలోని బుచారెస్ట్ నుంచి నాలుగో విమానం బయల్దేరింది. ఈ విమానంలో 198 మంది భారతీయులు స్వదేశానికి రానున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.
జెలెన్‌స్కీ- మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడినట్లు ఆయన ట్వీట్ చేశారు. రష్యా దురాక్రమణను నియంత్రిస్తున్నట్లు ప్రధాని మోదీకి తెలియజేశానని.. జెలెన్‌స్కీ అన్నారు. ఐరాస భద్రతా మండలిలో తమకు భారత్ నుంచి రాజకీయ మద్దతు కావాలని మోదీని కోరారు.
Also Read: Russia Ukraine War: రెండు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా- కీవ్‌లో ఉక్రెయిన్ ప్రతిఘటన
Also Read: Russia Ukraine War: చర్చలకు రష్యా ఓకే- సమావేశం కాదు ఇక సమరమే అంటోన్న ఉక్రెయిన్