SCO Summit 2025: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి చైనాలో పర్యటిస్తున్నారు. కానీ SCO సమ్మిట్ సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. నివేదిక ప్రకారం, భారతదేశం ఈ ప్రకటనలో సరిహద్దు దాటి జరుగుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదం సమస్యను చేర్చాలని, పహల్గాంలో ఉగ్రదాడిని ప్రస్తావించాలని కోరింది. అక్కడ అలా జరగలేదు. అదే సమయంలో రాజ్‌నాథ్ సింగ్ దాయాది పాకిస్తాన్‌కు మరో షాక్ ఇచ్చారు. ఆయన పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ను కూడా కలవలేదు.
భారత్ వైఖరిని స్పష్టం చేసిన రాజ్‌నాథ్
క్వింగ్డాలో జరిన SCO సమావేశంలో భారత్, పాకిస్తాన్, చైనా సహా 10 సభ్య దేశాలకు చెందిన రక్షణశాఖ మంత్రులు పాల్గొన్నారు. అయితే సమ్మిట్ అనంతరం రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్ లో ఉగ్రవాదంపై భారత్ చెప్పిన పాయింట్లు లేకపోవడం సంతకం చేయడానికి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. ఉగ్రవాదంపై అంతా కలిసి రావాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నట్లు అనిపించి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం వైఖరిని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. గతంలో భారత్ ఉగ్రవాదం సమస్యను పలుమార్లు ప్రపంచ వేదికపై లేవనెత్తింది. కానీ ఎవూ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి భారత్ ఈ సమస్యను SCO సమ్మిట్ జాయింట్ స్టేట్‌మెంట్‌లో చేర్చాలని సూచించినా అది సాధ్యం కాలేదు. దాంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షాంఫై సమ్మిట్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి, పాక్ ప్రేరేపిత టెర్రరిజాన్ని సైతం అందులో ప్రస్తావించాలని పట్టుపట్టారు. చివరికి ఆ జాయింట్ స్టేట్‌మెంట్‌లో ఆ విషయాలు లేని కారణంగా సంతకం చేసేది లేదంటూ పాక్‌తో పాటు చైనాకు భారత్ వైఖరి ఏంటో స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా వేదికగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసేవారు, ప్రోత్సహించే వారిని మనం బాధ్యులను చేయాలి. ఉగ్రవాదాన్ని ఎదుక్కోవడంలో రెండు నాల్కల ధోరణిని పాటించకూడదు అన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, కొన్ని దేశాలు ఇప్పటికీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఆ దేశ సరిహద్దు దాటి ఇతర దేశాలపై దాడులకు ఉగ్రవాదాన్ని తమ సాధనంగా ఉపయోగిస్తున్నాయని దాయాది పాక్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై..
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించారు. భారతదేశం ఉగ్రవాదాన్ని సహించదు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. SCO ఈ ముప్పును ఎదుర్కోవడంలో ఏకతాటిపైకి రావాలని సూచించారు. భారత్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గదన్నారు.