Rajasthan minister Ashok Chandna: రాజస్థాన్ మంత్రి అశోక్ చండ్న అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ఎమ్మెల్యే వాసుదేవ్ దేవనని ఖండించారు. రాజస్థాన్ మంత్రి అశోక్ చండ్న భిల్వరా జిల్లాలో అమ్మాయిల్ని వేలం వేస్తున్నారనే అంశంపై మంత్రి అశోక్ భిల్వారా జిల్లాలో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రూ.10 వేలకు అమ్మాయిల్ని వేలం వేయడం, అమ్మడమా.. ఆ ధరకు కాళ్లకు ధరించే షూస్ కూడా రావంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అశోక్. 


మంత్రి మాట్లాడిన మాటల వీడియోను బీజేపీ ఎమ్మెల్యే చండ్న భిల్వరా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. మంత్రి చాండ్న ₹10,000 లకు అమ్మాయిలను అమ్మడమా? పది వేలకు ఈ రోజుల్లో బూట్లు కూడా దొరకట్లేదు అని మంత్రి అశోక్ చండ్న వ్యాఖ్యానించారు. అమాయక యువతుల్ని, అమ్మాయిలను అమ్ముతున్నారు అన్న అంశంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మంత్రి అశోక్ బదులిస్తూ "అమ్మాయిల్ని అమ్మడమా.. ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో పదివేలకు కాలి బూట్లు కూడా దొరకవు, ఎం మాట్లాడుతున్నారు".. అని సమాధానమివ్వడం వివాదానికి దారితీసింది.


వాసుదేవ్ దేవనాని రాజస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. బాలికలు, యువతులు, మహిళలపై అనేక నేరాలు జరుగుతున్నాయి. అమ్మాయిలను అక్రమంగా అమ్మి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






అక్టోబరు నెలలో జాతీయ మహిళ సంఘం ఇద్దరు వ్యక్తులతో  నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పులు తీర్చుకోవడానికి భిల్వారా జిల్లాలో అమ్మాయిలను అమ్ముతున్నారు అన్న అంశంపై ఆధారాలు సేకరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. సున్నితమైన అంశంపై మంత్రి అశోక్ సరైన తీరుగా స్పందించలేదన్నారు. 


ఒక పత్రిక నివేదిక ప్రకారం అమ్మాయిలను వేలం వేసిన తర్వాత వారిని ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ముంబయి, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు కొందరు యువతులు, మహిళల్ని విదేశాలకు సైతం అక్రమంగా తరలిస్తున్నారని, ఆపై వారిని శారీరకంగా హింసించడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, బానిసలుగా అమ్మడం జరుగుతున్నాయని పేర్కొంది. ఈ నివేదిక లోని ఆంశాలు నిజమైతే మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినట్లు అవుతుందని జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది.