Rahul Gandhi:


రాహుల్ సాయం..


రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి తిరిగి వెళ్తుండగా నడిరోడ్డుపైనే స్కూటీపై నుంచి ఇద్దరు కింద పడిపోయారు. వెంటనే కాన్వాయ్‌ని ఆపిన రాహుల్...కార్ దిగి వాళ్ల దగ్గరకి వెళ్లారు. ఇద్దరినీ పరామర్శించారు. దెబ్బలు తగిలాయా అని అడిగారు. స్వయంగా ఆయనే స్కూటీని  పైకి లేపి వాళ్లకు సాయం చేశారు. ఇద్దరితోనూ మాట్లాడి వాళ్లకు షేక్‌ హ్యాండ్ ఇచ్చి మళ్లీ వెళ్లి కార్‌లో కూర్చున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. జన్‌నాయక్ అంటూ కాంగ్రెస్ పోస్ట్ చేసింది.