పంజాబ్‌లో మంత్రులకు శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి భగవంత్ మాన్. కీలకమైన హోంశాఖను భగవంత్ తన వద్దే ఉంచుకున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో చూద్దాం.







  • హర్పల్ చీమా- ఆర్థిక శాఖ

  • గుర్మీత్ సింగ్ మీట్ హయేర్- విద్యా శాఖ

  • డా. విజయ్ సింగ్లా- ఆరోగ్య శాఖ 

  • హర్‌జోత్ ఎస్ బైన్స్- న్యాయ, పర్యటక శాఖ


రాజ్యసభకు


ఆమ్ఆద్మీ పార్టీ ఈ నెలాఖరున జరిగే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ సహా మరో ముగ్గురిని ఎగువసభకు నామినేట్ చేసింది.


ప్రస్తుత రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 9న ముగియనుండగా ఆమ్ ఆద్మీ పార్టీకి 5 రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. దిల్లీ-ఐఐటీ ప్రొఫెసర్‌ సందీప్ పాఠక్‌, లవ్‌లీ ప్రొఫెషనల్ వర్సిటీ ఉపకులపతి అశోక్ మిత్తల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాను పెద్దల సభకు పంపుతోంది ఆప్.


పంజాబ్​లో 117 అసెంబ్లీ స్థానాల్లో 92 సీట్లను ఆప్ దక్కించుకుంది. ధురీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాన్​ 58,206 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోసారి అధికారం దక్కించుకుంటామని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు ఆప్ భారీ షాక్ ఇచ్చింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ, నవజోత్ సింగ్ సిద్ధూ సహా అగ్రనాయకులు అందరూ ఆప్ దెబ్బకు ఇంటిముఖం పట్టారు.


అంతేకాకుండా శిరోమణి అకాలీ దళ్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ఓటమిపాలయ్యారు. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పరాజయం పొందారు.


Also Read: Padma Awards 2022: భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్- ఆజాద్‌కు పద్మ భూషణ్


Also Read: Watch Video: కుర్రాడు 'బంగారం' అండి! పని చేసి 10 కిమీ పరిగెత్తి ఇంటికెళ్తాడు!