Bhagwant Mann hospitalized: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆసుపత్రిలో చేరారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో బుధవారం అర్ధరాత్రి దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో భగవంత్ మాన్ చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఆయనకు ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా మాన్ అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఇటీవల రాష్ట్రంలోని నదులు, బావులను శుద్ధి చేయాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఓ నదిలో నీళ్లు భగవంత్ మాన్ తాగినట్లు సమాచారం. దాని వల్లే ఇప్పుడు ఆయనకు కడుపు నొప్పి వచ్చిందని కొంత మంది నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఈ వార్తలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ మధ్యే
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఇటీవల పరిణయమాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది. ఈ పెళ్లికి దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతికొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరిగింది.
భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్‌కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లారు.
Also Read: Sonia Gandhi's ED appearance: ఈడీ ముందుకు సోనియా గాంధీ- దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన
Also Read: Ambulance Accident Karnataka: షాకింగ్ వీడియో- ఒకర్ని కాపాడబోయి నలుగుర్ని చంపిన అంబులెన్స్ డ్రైవర్!