Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయి. 45 మంది మృతి చెందారు. తాజాగా 18,294 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.
- డైలీ పాజిటివిటీ రేటు: 4.25 శాతం
- మొత్తం కేసులు : 4,38,25,185
- మొత్తం మరణాలు: 5,25,870
- యాక్టివ్ కేసులు: 1,48,881
- మొత్తం రికవరీలు: 4,31,50,434
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 29,12,855 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200.91 కోట్లు దాటింది. మరో 5,07,360 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.
Also Read: Central Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై కేంద్రం కీలక ప్రకటన- మిషన్ మోడ్‌లో భర్తీ!
Also Read: Kashmiri Pandit: అప్పటి నుంచి ఒక్క కశ్మీరీ పండిట్ కూడా వలసపోలేదు, లోక్‌సభలో కేంద్రం వివరణ