Cross Voting : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఎన్డీఏ పక్షాలకు ఉన్న ఓట్లు కంటే ఎక్కువే పోల్ అయ్యాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మద్దతుగా ఉన్న వారి కంటే అదనంగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేసినట్లుగా కౌంటింగ్‌ను బట్టి తెలుస్తోంది. విచిత్రంగా కేరళ నుంచి ముర్ముకు అనుకూలంగా ఒక ఓటు పోలైంది. 140 సభ్యులు ఉన్న కేరళ అసెంబ్లీలో ఎన్డీఏకు ఒక్క సీటు కూడా లేదు. కానీ ముర్ముకు ఆ రాష్ట్రం నుంచి ఓటు పడడం బీజేపీ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.
మరో మంత్రిని అరెస్ట్ చేయబోతున్నారు - బీజేపీపై ఢిల్లీ సీఎం ఆరోపణలు !
అస్సాంలో 25 మంది విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటేశారు . అస్సాం అసెంబ్లీలో 126 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో ఎన్డీఏకు 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆ రాష్ట్రం నుంచి ముర్ముకు అనుకూలంగా 104 ఓట్లు పోలయ్యాయి. ఎక్కువ ఓట్లు రావడానికి ముఖ్యంత్రి హిమంత శర్మ చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లోనూ ముర్ముకు 16 అదనపు ఓట్లు పోలయ్యాయి. ఆ రాష్ట్రంలో ఆమెకు మొత్తం 146 ఓట్లు పడ్డాయి. బీజేపీ ఉన్న సీట్ల కన్నా ఎక్కువ సంఖ్యలో ఆ పార్టీకి ఓట్లు ఎక్కువ. బెంగాల్‌లో బీజేపీకి 69 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ముర్ముకు అనుకూలంగా 71 ఓట్లు పడ్డాయి. జార్ఖండ్‌లో 81 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 9 మంది మాత్రమే యశ్వంత్‌కు సపోర్ట్ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ - జేఎంఎం పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న జేఎంఎం ముర్ముకే మద్దతు ప్రకటించి ఓట్లు వేసింది.
దయచేసి ఇలాంటి సాహసాలు చేయకండి, థార్ వీడియోపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్‌కు విశ్వాస పరీక్ష సమయంలో 164 ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ ఆ రాష్ట్రం నుంచి ముర్ముకు అనుకూలంగా 181 ఓట్లు పోలయ్యా. ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన కూడా ముర్ముకే మద్దతు తెలిపింది. మేఘాలయాలో ఉన్న టీఎంసీ ఎమ్మెల్యేలు కొందరు క్రాస్ ఓటింగ్ చేశారు. మణిపూర్‌లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటేశారు.
బీహార్, చత్తీస్‌ఘడ్‌లోని ఆరేసి మంది విపక్ష ఎమ్మెల్యేలు, గోవా నుంచి నలుగురు విపక్ష ఎమ్మెల్యేలు, గుజరాత్ నుంచి పది మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్లుగా ఫలితాల ద్వారా వెల్లడయింది. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో యశ్వంత్ సిన్హాకు ఒక్క ఓటు కూడా పోలవ్వలేదు.