Jamili Elections  :  వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అన్నది బీజేపీ విధానం. కొంత కాలంగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు కీలక సమాధానం ఇచ్చారు. జమిలీ ఎన్నికల అంశం ప్రస్తుతం లా కమిషన్ వద్దపరిశీలనలో ఉందని తెలిపారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కిరణ్ రిజుజు .. వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల కలుగుతున్న నష్టాలను వెల్లడించారు. రాష్ట్రాలు, పార్లమెంట్‌కు ఒకే సారి ఎన్నికలు జరపాలన్న అంశంపై లాకమిషన్ కు.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించిందన్నారు. 


స్మోకింగ్ ఏజ్‌ను పెంచాలంటూ పిటిషన్, పబ్లిసిటీ కోసమా అంటూ సుప్రీం కోర్టు అక్షింతలు


సీఈసీ సహా అనేక భాగస్వామ్య పక్షాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని లా కమిషన్‌కు సమర్పించారని .. అందులో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. ఆ నివేదిక సిఫార్సును అధ్యయనం చేసి రోడ్ మ్యాప్ తయారు చేసే ప్రయత్నంలో ఉందన్నారు. రాష్ట్రాలకు, పార్లమెంట్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశానికి ఆర్థికంగా భారం అవుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఎనిమిదేళ్లలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని.. రూ. ఏడు వేల కోట్లకుపైగా ఖర్చయిందన్నారు. 


ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. లా కమిషన్ కూడా రికార్డెడ్‌గా పార్టీల అభిప్రాయాలను నమోదు చేసింది. అత్యధిక పార్టీలు ఓకే చేశాయి. ప్రధానమంత్రి కూడా పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఓ ఎన్నికల సందడి ఉండటం వల్ల.. అభివృద్ధి కుంటు పడుతోందని … బీజేపీ అగ్రనేతల అభిప్రాయం. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత .. ప్రతీ ఏడాది ఏదో ఓ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్ాయి. ఆ తర్వాత రాష్ట్రాల్లో స్థానిక సంస్థల హడావుడి ఉంటోంది. ఈ కారణంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వాల  దృష్టి పూర్తిగా ఎన్నికల మీదే ఉంటోందని .. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని కేంద్రం అనుకుంటోంది. 


జీఎస్టీ మీద మీమ్స్ ఆగడం లేదుగా - ఇప్పుడు రణవీర్ నగ్న ఫోటోలతో ఆడుకుంటున్నారు


బీజేపీ జమిలీ ఎన్నికలకు వెళ్లాలనే చాలా స్పష్టమైన విధానంతో ఉంది. అయితే అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో లా కమిషన్ సిఫార్సులు చేయనుంది. దాన్ని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. అయితే అవి అంత సామాన్యంగా పరిష్కారాలు దొరికే సమస్యలు కాదు కాబట్టి ఆలస్యమవుతోందని భావిస్తున్నారు.