అఫ్గానిస్థాన్ పై ప్రధాని మోదీ మాట్లాడారు. అఫ్గాన్ లో ప్రస్తుత పరిస్థితులు దారణమన్నారు. అయితే అఫ్గాన్ లో ఉన్న భారత ప్రజలను తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం దీనిపై మాట్లాడుతుందన్నారు. ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ ఈ ప్రయత్నాలు జరుగుతాయన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పునర్నిర్మించిన జలియన్‌వాలా బాగ్ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరిస్తూ ఆయన అఫ్గానిస్థాన్ సంక్షోభం గురించి మాట్లాడారు.


Also Read: Bengal BJP vs Mamata : దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ..!


'ప్రపంచంలో ఎక్కడైనా, ఏ భారతీయుడు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, భారత ఊరుకోదు. వారికి అండగా నిలుస్తుంది. కరోనా సవాళ్లు కావచ్చు..,  అఫ్గానిస్థాన్ సంక్షోభం కావచ్చు. వందలాది మంది భారతీయులను అఫ్గానిస్థాన్ నుంచి ఆపరేషన్ దేవి శక్తి కింద భారతదేశానికి తీసుకువచ్చాం. అక్కడ అనేక సవాళ్లు ఉన్నాయి. పరిస్థితి క్లిష్టంగా ఉంది.' అని ప్రధాని మోదీ అన్నారు.


Also Read: Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది


అఫ్గానిస్థాన్ నుంచి భార‌తీయుల‌ను స్వదేశానికి  త‌ర‌లించే ఆప‌రేష‌న్‌కు దేవి శ‌క్తిగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జ‌య‌శంక‌ర్ గతంలో ట్విట్టర్ ద్వారా తెలిపారు. 


Also Read: Aadhaar-PAN: ఆధార్, పాన్ లింక్ సేవల్లో అవాంతరాలకు చెక్.. సక్రమంగా పనిచేస్తున్నాయన్న యూఐడీఏఐ


ప్రస్తుతం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. కొన్ని రోజుల క్రితం తాలిబ‌న్‌లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.  భార‌త్ స‌హా అమెరికా త‌దిత‌ర దేశాలు అఫ్గానిస్థాన్ నుంచి త‌మ పౌరుల‌ను స్వదేశానికి తీసుకెళ్తున్నాయి.


Also Read: Covid: పాఠశాలలను వెంటనే తెరవండి.. లేదంటే ముప్పు తప్పదు.. కేంద్రానికి నిపుణుల లేఖ


అమెరికా-చైనా చర్చలు


అఫ్గాన్​ సంక్షోభం మధ్య అమెరికా, చైనా మధ్య ఉన్నత స్థాయి మిలటరీ చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత చైనాతో జరిగిన తొలి సైనిక చర్చ ఇదే.  ఈ సమావేశంలో వేగంగా మారుతున్న అఫ్గానిస్థాన్​ పరిస్థితులపై చర్చ జరిగింది. పీపుల్స్​ లిబరేషన్ ఆర్మీ  డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ హువాంగ్ జూపింగ్, యూఎస్​ సైనికాధికారి మైఖేల్ ఛేజ్​తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


Also Read: Jalianwala bagh Smarak: జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ