కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ ఇటీవల అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశంలో 100 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ పూర్తి అయిన సందర్భంగా 7 కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీరం ఇనిస్టిస్టూట్ కు చెందిన ఆధార్ పునావాలా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, మరో కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. టీకాలపై మరింత అధ్యయనం చేశాలని కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది.


కరోనాపై యుద్ధంలో భారత్ పోరాటం అద్భుతమని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అన్నారు. భారత్‌లో సగం వ్యాక్సిన్లు ఇవ్వడానికి కొన్నేళ్లు పడుతుందని, అసలు భారతదేశంలో వ్యాక్సిన్ తయారవుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయని పేర్కొన్నారు. భారత్ సాధించిన 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఇది దేశంలోని ప్రతి ఒక్కరి విజయమని మోదీ అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొట్టాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.






Also Read: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ 


భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరిస్, బయోలాజికల్ ఇ, జైడల్ క్యాడిలా, జెన్నోవా బయోఫార్మా, పానాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధాని మోదీతో భేటీలో పాల్గొన్నారు. దేశంలో 100 కోట్ల డోసుల మార్క్ చేరడంపై వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను ప్రధాని అభినందించారు. కొవిడ్ టీకాలపై మరింతగా పరిశోధన చేయడంతో పాటు దేశంలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ దిశగా అడుగులు వేయడంపై చర్చ జరుగుతుంది.


Also Read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి