Petrol Diesel Price: త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏప్రిల్ 2022 నుంచి చమురు ధరలు పెరగకుండా చూసిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా కొనసాగితే ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ విషయంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తానేమీ చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. సమయం గడుస్తున్నా కొద్దీ ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నారు. గత త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంసఅథలు సంతృప్తికర ఆర్థిక ఫలితాలు సాధించాయని వివరించారు. కొంతమేర నష్టాలను పూడ్చుకోగలిగాయన్నారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ధరలు తగ్గించడంపై ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెప్పారు. సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.  


పెట్రోలియం ధరల విషయంలో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌లను బీజేపీ ప్రభుత్వాల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నప్పుడు కూడా వ్యాట్‌ను తగ్గించకుండా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి నొక్కి చెప్పారు. మరోవైపు చమురు శుద్ధి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 252 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 400 - 500 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందన్నారు. శనివారం పలు కీలక నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు ₹100 కంటే ఎక్కువగానే కొనసాగాయి. తాజా సవరణల ప్రకారం, పెట్రోల్ న్యూఢిల్లీలో ₹96.72, కోల్‌కతాలో ₹106.03, ముంబైలో ₹106.31 మరియు చెన్నైలో ₹102.80కి రిటైల్ అవుతోంది.


తెలంగాణలో పెట్రోల్ ధరలు


హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర మారడం లేదు. కొన్ని నెలలుగా ₹ 109.66 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.10 ---- నిన్నటి ధర ₹ 109.10
వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.10 ---- నిన్నటి ధర ₹ 109.10
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.45 ---- నిన్నటి ధర ₹ 111.27 
నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.41 ---- నిన్నటి ధర ₹ 109.76 
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.77 ---- నిన్నటి ధర ₹ 109.77
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.83 ---- నిన్నటి ధర ₹ 111.83 


తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)
హైదరాబాద్‌లో (Diesel Price in Hyderabad) డీజిల్ ధరలోనూ మార్పు ఉండడం లేదు. లీటర్‌ డీజిల్‌ ₹ 97.82 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Diesel Price in Warangal) లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.29 ---- నిన్నటి ధర ₹ 97.29 
వరంగల్ రూరల్ జిల్లాలో (Diesel Price in Warangal Rural) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.29 ---- నిన్నటి ధర ₹ 97.29 
నిజామాబాద్‌లో (Diesel Price in Nizamabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 99.48 ---- నిన్నటి ధర ₹ 99.31 
నల్లగొండలో (Diesel Price in Nalgonda) డీజిల్‌ నేటి ధర ₹ 97.57 ---- నిన్నటి ధర ₹ 97.90 
కరీంగనర్‌లో (Diesel Price in Karimnagar‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.91 ---- నిన్నటి ధర ₹ 97.91
ఆదిలాబాద్‌లో (Diesel Price in Adilabad‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.84 ---- నిన్నటి ధర ₹ 99.84