Petrol Diesel Prices: 


పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం..


పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ (VAT on Petrol) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇకపై లీటర్‌ పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పులు రానున్నాయి. ఈ మేరకు ప్రజలపై భారం పడనుంది. డీజిల్ ధరల్నీ పెంచేసింది. ఈ పెరిగిన ధరల తరవాత అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.98.65 గా ఉండగా...డీజిల్ లీటర్ ధర రూ.88.95కి పెరిగింది. దాదాపు ఏడాదిగా రాష్ట్రంలో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు ప్రభుత్వం. గతేడాది ఏప్రిల్ నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై 1.8% వ్యాట్ పెంచుతున్నట్టు తెలిపింది. ఈ ఆధారంగా చూస్తే...గతంలో ఉన్న ధరకు 92 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డీజిల్‌ విషయానికొస్తే వ్యాట్‌ని 1.13%కి పెంచింది పంజాబ్ ప్రభుత్వం. అంటే అదనంగా 90 పైసలు చెల్లించాలి. ఈ రోజు (జూన్ 11) 12 గంటల తరవాత ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా...కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే...ఇప్పటి వరకూ అధికారికంగా ఆప్ ఈ ప్రకటన చేయలేదు. న్యూస్ ఏజెన్సీ ANI ఈ వివరాలు వెల్లడించింది.